TS Jr Lecturer Exam Syllabus: జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షలకు ఏ పుస్తకాలు చదవాలి..?

ఒక్కసారిగా భారీగా తెలంగాణలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రెండు రోజుల తర్వాత(డిసెంబర్‌ 16) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ సమయంలో ప్రతీ రోజూ ప్రతీ గంట విలువైందిగా భావించాలి. ఇందుకోసం ఏ పుస్తకాలు చదవాలి.. ఎలా సన్నద్ధమవ్వాలో తెలుసుకుని విజయం సాధించండి.
పేపర్‌–1 కోసం ఈ పుస్తకాలు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన 6 నుంచి 10 తరగతుల సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ పుస్తకాలను చదవాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివి అర్థం చేసుకోగలిగితే 6 నుంచి 10వ తరగతుల ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలను కూడా చదువుకోవచ్చు. తెలుగు అకాడమీ కూడా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–1కు సంబంధించిన అనేక పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు వీటిని చదవొచ్చు.
పేపర్‌–2 కోసం.... 
పేపర్‌–2 కోసం ముందుగా ఇంటర్, డిగ్రీ,  పీజీ స్థాయి పుస్తకాల పఠనం అవసరం. విద్యార్థిగా ఉన్నప్పుడు వీటిని అనేకసార్లు చదివివుంటారు. కాబట్టి సబ్జెక్టు తేలిగ్గా అర్థం అవుతుంది. నెట్, స్లెట్‌కు క్వాలిఫై అయినవారు లేదా సన్నద్ధతను సాగించినవారు ఇప్పటికే చదివిన పుస్తకాలను తిరిగి చదవాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన సబ్జెక్టు సంబంధిత ఇంటర్, డిగ్రీ స్థాయి ఆంగ్ల మాధ్యమ పుస్తకాలూ ఉపయోగపడతాయి. సబ్జెక్టు పేపర్‌లో ఉన్న కొన్ని అంశాలు లోతుగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. వీటి కోసం సబ్జెక్టు నిపుణులు రాసిన ప్రత్యేక పుస్తకాలను చదవాలి.

#Tags