TSPSC CDPO & EO 2023 Exam Cancelled : బ్రేకింగ్ న్యూస్‌.. తెలంగాణ‌లో CDPO & EO ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : గ‌త ప్ర‌భుత్వంలో నిర్వ‌హించిన‌ తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలోని CDPO, EO ప‌రీక్ష‌ల‌ను జూలై 19వ తేదీన‌ ర‌ద్దు చేశారు. అయితే గ‌తంలో CDPO ఫ‌లితాల‌ను విడుద‌ల చేసి..certificate verification కూడా పూర్తి చేసిన విష‌యం తెల్సిందే.

అయితే certificate verification పూర్తి చేసిన వీరి పోస్టింగ్స్ ఇవ్వ‌లేదు. దీంతో ఈ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించిన అభ్య‌ర్థులు పోస్టింగ్స్ ఇవ్వాల‌ని కోర్డు కూడా ఆశ్ర‌యించారు. అలాగే ఈ ప‌రీక్ష విజ‌యం సాధించ‌ని అభ్య‌ర్థులు కూడా.. గ్రూప్‌-1 ప‌రీక్ష‌లాగా.. CDPO కొశ్చ‌న్ పేప‌ర్ కూడా లీక్ అయింద‌ని అభ్య‌ర్థుల హైకోర్టు ఆశ్ర‌యించారు. అలాగే గ్రూప్‌-1లో మాదిరిగా.. EO ప‌రీక్ష‌లో బ‌యోమెట్రిక్ తీసుకోలేద‌ని.. కొంద‌రు అభ్య‌ర్థుల కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెల్సిందే.

ఈ నివేదిక ప్ర‌కార‌మే..

Central Forensic Science Laboratory report, Special Investigation Team (SIT) నివేదిక ప్ర‌కారం చ‌ర్చించి CDPO, EO ప‌రీక్ష‌ను టీఎస్‌పీఎస్సీ ర‌ద్దు చేసింది. CDPO, EO ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కొత్త తేదీల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌న్ని ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ ఒక వెబ్‌నోట్‌ను విడుద‌ల చేసింది.

పూర్తి వివ‌రాలు ఇవే..

 

#Tags