Thotapalli Jyothi: పట్టుదలతో చదివి.. ప్రభుత్వ కొలువులు పట్టి

దహెగాం(సిర్పూర్‌): రెక్కాడితె గాని డొక్కాడని నిరుపేద కుటుంబం.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం.. పదో తరగతి చదువుతుండగా తండ్రి మృతి.. ఇలా ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో చదివి ప్రభుత్వ కొలువులు సాధించింది దహెగాం మండలం పంబాపూర్‌కు చెందిన తోటపల్లి జ్యోతి.

తోటపల్లి బాబాజీ, ప్రమీల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. పెద్దకుమార్తె జ్యోతి ఐదో తరగతి వరకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదివింది. ఆ తర్వాత మండల కేంద్రంలోని కేజీబీవీలో పదో తరగతి పూర్తి చేసింది. వరంగల్‌లో పాలిటెక్నిక్‌.. తర్వాత హైదరాబాద్‌ బీటెక్‌, జేఎన్‌టీయూలో ఎంటెక్‌ చదివింది.

జ్యోతి పదో తరగతి చదువుతుండగా తండ్రి బాబాజీ మృతి చెందగా తల్లి వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ పిల్లలను చదివించింది. ఉన్నత ఉద్యోగం సాధించాలనే తపనతో జ్యోతి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంది.

చదవండి: IAS Uma Harathi Real Life Story : అద్భుత‌మైన దృశ్యం.. IAS అయిన కూతురికి.. IPS అయిన తండ్రి సెల్యూట్.. ఈమె స‌క్సెస్ జ‌ర్నీ ఇదే..

ఇటీవల వెలువడిన ఫలితాల్లో పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈఈ, మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్‌ అధికారితోపాటు గ్రూప్‌– 4కు సైతం ఎంపికై ంది. అయితే గ్రూప్‌– 4 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కావాల్సి ఉంది. గ్రూప్‌– 2 ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. కాగా.. ఆమె ఇద్దరు చెల్లెళ్లు ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్‌ చదువుతున్నారు.

#Tags