TGPSC Group 2 Exam: గ్రూప్–2 పరీక్షలో నిర్మల్ ప్రస్తావన
18వ శతాబ్దంనాటి రాంజీగోండ్ తన బృందంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి నిర్మల్ వరకు తన ప్రాబల్యాన్ని పెంచుకుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అంశాలపై ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు జిల్లాకు చెందిన అభ్యర్థులు వాటికి ఉత్సాహంగా సమాధానమిచ్చారు.
ఈ ప్రశ్నలో రాంజీగోండ్, కుమురంభీమ్, వేయి ఉరులమర్రి, జల్–జంగల్–జమీన్‌నకు సంబంధించిన నాలుగు అంశాలను ఇచ్చి అందులో సరైన వాటిని గుర్తించమని అడిగారు. రాంజీగోండ్‌తోపాటు వెయ్యిమంది యోధులను నిర్మల్ ప్రాంతంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మర్రిచెట్టుకు ఉరివేసింది. వేయి ఉరుల మర్రిగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, రాంజీగోండ్ స్వతంత్ర పాలనారాజధాని అంశాలపై ప్రశ్న సంధించారు.
నిర్మల్ ప్రాంతానికి చెందిన చారిత్రాక అంశాలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ప్రాధాన్యత కల్పించడంపై జిల్లా కేంద్రానికి చెందిన అభ్యర్థులు యెల్మల శ్రీనివాస్, జుట్టు చంద్రశేఖర్ తదితరులు హర్షం వ్యక్తంజేశారు.
ఉమ్మడిజిల్లా స్థానిక చరిత్ర ప్రాధాన్యతపై పాఠ్యాంశంగా చేర్చితే యువతరానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఉమ్మడి జిల్లా చరిత్ర ప్రాధాన్యతను భావితరాలు గుర్తిస్తాయని చరిత్ర పరిశోధకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కట్కం మురళి అభిప్రాయపడ్డారు. కాగా, జిల్లా చరిత్ర, జనాభా గణాంకాలపై గత గ్రూప్–3లోనూ ప్రశ్నలు చోటుచేసుకోవడం గమనార్హం.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |