IAS Officers Transferred- తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆమెస్థానంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ను నియమించారు. వీరితోపాటు పలు వురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఐఏఎస్‌ ఆఫీసర్ల బదిలీ
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ డైరెక్టర్‌గా ఉన్న లచ్చిరాంభూక్యను ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్‌ చేస్తూ కేంద్ర సర్వీసులకు తిప్పి పంపించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న బి.గోపికి ఫిషరీస్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.  


–  హైదరాబాద్‌ జిల్లా చీఫ్‌ రేషనింగ్‌ అధికారి బి.బాలమాయాదేవి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా,  
– రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.హనుమంతరావును రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్‌ ఆఫీషియో సెక్రటరీగాను  
– సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ కె. అశోక్‌రెడ్డిని ఉద్యానవనశాఖ డైరెక్టర్‌గా,  
– క్రిస్టియన్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎ.నిర్మలకాంతి వెస్లీని స్త్రీ, శిశు, వయోజనుల సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ, ఆమెకే ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ పోస్టును సైతం ప్రభుత్వం అప్పగించింది.  
 – హైదరాబాద్‌ జూ పార్క్‌ డైరెక్టర్‌గా ఉన్న విఎస్‌ఎన్‌వి.ప్రసాద్‌కు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ నియమించింది.  
 – వెయిటింగ్‌లో ఇద్దరిలో సీతాలక్ష్మిని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ, తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీల కార్యదర్శిగాను, జి.ఫణీంద్రరెడ్డికి హైదరాబాద్‌ జిల్లా రేషనింగ్‌ అధికారిగా బదిలీ చేసింది.  
 
 

#Tags