Group 2 Exams Schedule: గ్రూప్‌–2 పరీక్షలు షెడ్యూల్‌ విడుదల చేసిన టీజీపీఎస్సీ

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షల షెడ్యూ­ల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీ­పీ­ఎస్సీ) ప్రకటించింది.

ఈ ఏడాది డిసెంబర్‌ 15, 16 తేదీల్లో నాలుగు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. మధ్యా­హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఐదోసారి ప్రకటన

వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్‌–2 ఉద్యో­గ ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 26న నోటిఫికేషన్‌ విడుదల చేయడం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హ­త పరీ­క్షలు ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడగా తాజాగా టీజీపీఎస్సీ ఐదోసారి పరీక్షల తేదీ­లను ప్రకటించింది.

గతేడాది ఆగస్టులో జరగా­ల్సిన ఈ పరీక్షలను ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవ­హా­రంతో అక్టోబర్‌కు రీ–షెడ్యూల్‌ చేస్తూ టీజీపీఎస్సీ తేదీలను ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు కమిషన్‌ మరో ప్రకటన చేసింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడటం, టీజీపీఎస్సీని ప్రక్షాళనతో ఏర్పాటైన కమిషన్‌... గ్రూప్‌–2 పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ విడుదల చేసింది.

కానీ డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్‌–2 పరీక్షల తేదీలను మార్చాలంటూ క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం... పరీక్షల తేదీలను మార్చాలని కమిషన్‌కు సూచించింది. ఈ క్రమంలో డిసెంబర్‌లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన కమిషన్‌ తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రూప్‌–2 ఉద్యోగాల కోసం 5.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

#Tags