‘ఆ 29 ప్రశ్నలకు బోనస్ మార్కులు’
సాక్షి, హైదరాబాద్: శాఖాపరమైన జీవోటీ పేపర్ 88, 97 పరీక్షలకు సంబంధించి 29 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణికి విన్నవించినట్లు పీఆర్‌టీయూ-టీఎస్ వెల్లడించింది.
సోమవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఘంటాను కలసిన ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. ఆ ప్రశ్నలను తొలగించి పూర్తి మార్కులు ఇవ్వాలని కోరారు. చైర్మన్ అంగీకరించారని, మంగళవారం ఫలితాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
#Tags