3. ప్రసరణ పదార్థ రావాణా వ్యవస్థ
క్విక్ రివ్యూ
ప్రసరణ:- శరీరం పెరుగుదల నిర్వాహణ కోసం అన్ని జీవులకు పోషకాలు, వాయులు మొదలైనవి శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరణ జరగడం అవసరం. పదార్థాలు ఒక చోటు నుండి మరో చోటికి చేరుకోవడం.
రక్తప్రసరణ విధానం:- జీవుల శరీరంలో పదార్థాల రవాణా ముఖ్యంగా రక్తం ద్వారా జరుగుతుంది. జీవల్లో రక్తప్రసరణ విధానము రెండు రకాలుగా ఉంటుంది. (1) ఏక ప్రసరణ వలయం: రక్తం ఒకేసారి గుండె ద్వారా ప్రయాణించే ప్రసరణ విధానం. ఉదా చేపలు
(2) ద్విప్రసరణ వలయం: దీనిలో రక్తం ఒక ప్రసరణ వలయంలో గుండె ద్వారా రెండు సార్లు ప్రయాణిస్తుంది. ఉదా॥పక్షులు, సరీసృపాలు క్షీరదాలు.
గుండెగదులు:- మానవునిలో గుండె 4 గదులుగా ఉంటుంది. పెరైండు గదులను కర్ణికలు అంటారు. కుడి కర్ణికలో ఆమ్లజని రహిత రక్తం, ఎడమ కర్ణికలో ఆమ్లజని సహిత రక్తం కలవకుండా ఉంటుంది. క్రింది రెండు గదులను జఠరికలు అంటారు. కుడి జఠరికలో ఆమ్లజని రహిత రక్తం, ఎడమ జఠరికలో ఆమ్లజని సహితరక్తం ఉంటుంది. రక్తం కలవకుండా కవాటాలు అమరి ఉంటాయి.
రక్తనాళాలు: - జీవుల్లో రక్తం ప్రసరణం చెందడం రక్తనాళాల్లో జరుగుతుంది. అవి ధమనులు, సిరలు. గుండె నుండి శరీర భాగలకు రక్తాన్ని తీసుకుపోయేవి ధమనులు. దీనిలో O2 తో కూడిన శుద్ధరక్తం ఉంటుంది. వివిధ శరీర భాగల నుండి గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలే సిరలు. దీనిలో CO2 తో కూడిన మలినరక్తం ఉంటుంది.
హృదయ స్పందన:- గుండె యొక్క సంకోచం (సిస్టోల్), సడలిక (డయాస్టోల్)ను కలిపి హృదయస్పందన అంటారు. సిస్టోల్‌లో కండరాలు చురుకుగా పనిచేస్తాయి. డయాస్టోల్ స్థితిలో కండరాలు యధాస్థితికి వస్తాయి. మానవునిలో హృదయస్పందన నిమిషానికి 60 నుండి 72 సార్లు ఉంటుంది.
రక్తపీడనం: రక్తనాళాలలో రక్తం ఏ పీడనంతో ప్రవహిస్తుందో దానిని రక్తపీడనం అంటారు. గుండెలోని జఠరికలు సంకోచించి అత్యధిక పీడనంతో రక్తాన్ని ధమనులలోకి పంపుతాయి. కావున ధమనులలో రక్తపీడనం ఎక్కువ. సిరలు రక్తాన్ని సేకరిస్తాయి. కావున సిరలలో రక్తపీడనం తక్కువ. సాధారణ రక్తపీడనం 120/80 గా ఉంటుంది. దీనిని స్పిగ్మోమానోమీటర్ తో కొలుస్తారు.
రక్తస్కందనం: శరీరానికి గాయం తగిలినపుడు రక్తం కొద్దిసేపు మాత్రమే కారుతుంది. తర్వాత రక్తం గట్టికట్టి గాయమైన చోట ఒక ఎర్రని గడ్డలా ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డనే స్కందనం అంటారు. రక్తంలో ఉండే రక్తఫలకికలు రక్తస్కందన క్రియను ప్రారంభిస్తాయి. శస్త్రచికిత్స సమయంలోనైతే రక్తస్కందనకు విటమిన్ కె కూడా తోడ్పడును.
మూలకేశాలు:- వేర్ల మీద ఉన్న సన్నని కేశాల వంటి నిర్మాణాలే మూలకేశాలు. ఇవి ఒకే వరుస కణాలున్న బాహ్యచర్మం నుండి ఉద్భవిస్తాయి. ఇవి నీటి శేషణంలో తోడ్పడతాయి.
దారువు: సజీవ నిర్జీవ కణాలతో కూడి ఉన్న ప్రసరణ కణజాలం మొక్కకు నీటిని, లవణణాలను అందిస్తుంది. దారువు మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. దారువు అంటే ‘చాగ’ అని పేర్కొంటారు. వాణిజ్యరీత్యా ఇది ఎంతో విలువైనది.
పోషక కణజాలం: దీనిని బాస్ట్ లేదా లెప్టోమ్ అని కూడా అంటారు. ఇది సజీవ కణజాలం. పత్రాలలో తయారైన ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా మొక్కలోని మిగతా భాగలకు అందించబడతాయి.
వేరు పీడనం: మొక్క యొక్క వేరు భాగంలో అధిక సంఖ్యలో ఉన్న మూలకేశాలు, వేరు కణాలు నీటిని పీల్చుకుంటాయి. ఈ నీరు దారునాళాలలతో ఉన్న నీటిపై ఒత్తిడిని కలుగజేస్తుంది. ఈ ఒత్తిడినే ‘వేరుపీడనం’ అంటారు. ఈ పీడనం నీటిని పైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. దీని వల్లనే ఎత్తై చెట్లలో సైతం వ్రేళ్ళద్వారా నీరు సులభంగా అందించబడుతుంది.
భాష్పోత్సేకం: వేళ్ళ ద్వారా మొక్కలోకి చేరిన నీరు. అది వినియోగించుకోగా మిగిలిన నీటిని పత్రరంద్రాల ద్వారా ఆవిరి రూపంలో వావావరణంలో కలుస్తుంది.
విషయ విశ్లేషణ:-
సృష్టిలో అన్ని జీవులు తమ మనుగడ కోసం ఆరోగ్యంగా జీవించాలంటే వాటి జీవక్రియలకు (పెరుగదల, శ్వాసక్రియ మొ॥పోషకాలు, ద్రవ, వాయు పదర్థాలు అవసరం ఇవి శరీరంలోకి గ్రహించడం, తొలగించడం వంటి ప్రక్రియలకు రవాణా వ్యవస్థ అవసరం.
బహుకణ మరియు ఉన్నత స్థాయి జంతువుల, మొక్కలలో రవాణా వ్యవస్థ ఆవశ్యకత:
1. రావాణా వ్యవస్థలో రకాలు
2. మానవునిలో రక్త ప్రసరణ.
3. మొక్కలలో నీరు, పోషకాల రవాణా
అమీబా, హైడ్రా వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ వ్యాపనం, ద్రవాభిసరణ వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఉన్నత స్థాయి జీవుల్లో ప్రత్యేకమైన ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
రవాణా వ్యవస్థలో రకాలు:-రక్తప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తనాళాలు, రక్తము ఉంటాయి. ప్రసరణ వ్యవస్థ రెండు రకాలు.
1. స్వేఛ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ: కీటకాలు, మొలస్కా వంటి జీవులలో రక్తనాళాలు లేవు. ప్రత్యేకమైన కోటరాల ద్వారా గుండెకు రక్తం ప్రసరిస్తుంది. దీనిని స్వేఛ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ అంటారు.
2. బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ:- చాలా జంతువులలో రక్తనాళాలు (ధమనులు, సిరలు) ఉంటాయి. హృదయం రక్తాన్ని వీటిలోకి పంపు చేస్తుంది. దీనిని బంధిత రక్తప్రసరణ వ్యవస్థ అంటారు.
రక్త ప్రసరణ మార్గాలు:-వివిధ జీవులలో రక్త ప్రసారం రెండు రకాలుగా ఉంటుంది.
అవి. 1. ఏక ప్రసరణ వలయం
2. ద్వి ప్రసరణ వలయం
ఏక ప్రసరణ వలయం: రక్తం ఒకేసారి గుండె ద్వారా ప్రయాణించే ప్రసరణ విధానం ఉదా॥చేపులు
ద్విప్రసరణ వలయం: రక్తం గుండెద్వారా రెండుసార్లు ప్రవహిస్తే దానిని ‘‘ద్వివలయ రక్త ప్రసరణం’ అంటారు. ఈ వలయంలో ఒకసారి ఊపిరితిత్తులు, హృదయం మధ్య, రెండుసారి హృదయం, శరీరం భాల మధ్య జరుగుతుంది. ఉదా॥క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయజీవులు
మొక్కలలో పోషకాల రవాణా:
వేర్లు శోషించిన నీరు, పత్రాలలో తయారైన ఆహార పదార్థం దారువు మరియు పోషక కణజాలం అనే నాళికా పుంజ వ్యవస్థ ద్వారా మొక్క ఇతర భాగాలకు సరఫరా అవుతాయి.
విసరణ, ద్రవిభా సరణం ద్వారా మొక్కలు నీటిని, లవణాలను గ్రహిస్తాయి.
నీరు, లవణాలు వేర్ల నుండి దారు నాళ్లా ద్వారా మొక్కలోని ఇతర భాగాలకుర సరఫరా చేయబడతాయి. నీరు దారు నాళాల ద్వారా సంసంజన, అసంజన బలాలు ఉపయోగించుకొని భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి పైకి పోతుంది.
వేరు పీడనం, భాష్పోత్యేకం ప్రక్రియల వల్ల నీరు ఎంత ఎత్తులో ఉన్న మొక్కలకైనా సులువుగా అంతించబడుతుంది.
జవాబులు:
1)రెనిలెన్నెక్; 2)హృదయావరణం (పెరికార్డియం); 3)హిస్టోగ్రామ్; 4)గైరోలమా ఫాబ్రిసి; 5) హెమటాలజీ; 6)హీమోగ్రామ్; 7) 0.8 సెకన్లు ;8)హీమోఫోలియా; 9)శోషరసవ్యవస్థ; 10)విలియం హార్వే ;11)కార్డియాలజి; 12) 3-6 నిమిషాలు; 13)థ్రాంబోకైనేజ్; 14) 115-120 గ్రా/లీ; 15) విటమిన్ కె.; 16)ద్రవాభిసరణం; 17)బృహద్ధమని; 18) రక్తఫలకికలు; 19)తలసేమియా ;20)భాష్పోత్సేకం .
జవాబులు:
1)డి; 2)బి ;3)ఇ; 4)ఎ; 5)సి.

4 మార్కుల ప్రశ్న జవాబులు
- హృదయంలో కవాటాల పని ఏమిటి?
క్రమ.సంఖ్య కవాటం పేరు స్థానము రక్తం ఎక్కడ నుండి ఎక్కడికి చేరుతుంది. 1 అగ్రతయ కవాటం లేక ప్రిపత్ర కవాటం (అనగా మూడు అగ్రాలు ఉంటాయి) కుడికర్ణికా జఠరికారంధ్రం కుడికర్ణిక నుండి జఠరికకు 2 అగ్రద్వయ లేదా మిట్రల్ కవాటం (అనగా 2 అగ్రాలు గలది) ఎడమ కర్ణికా జఠరికా రంధ్రం ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికకలు 3 పుపుస కవాటాలు (3 అర్ధ చంద్రాకార కవాటాలు) కుడి జఠరిక నుండి పుపుస మహాధమని బయలు దేరే చోటు కుడి జఠరిక నుండి పుపుస మహాధమనిలోకి 4 మహాధమని కవాటాలు (3 అర్ధ చంద్రాకార కవాటాలు) ఎడమ జఠరిక నుండి దైహిక మహాధమని ఎడమ కర్ణిక నుండి మహాధమనిలోకి
- మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలు నీటిని గ్రహించే విధానాన్ని వివరించండి. (AS-1)
1. లవణాలతో కూడిన మృత్తిక నీరు మొక్క యొక్క మూలకేశాలలోనికి ద్రవాభిసరణ పద్ధతి ద్వారా ప్రవేశిస్తుంది.
2. మూల కేశాలలలోని కణరసం గాఢత మృత్తిక నీటి గాఢత కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ద్రబాభిసరణ ద్వారా మూలకేశాలలోని రిక్తికలోనికి నీరు ప్రవేశిస్తుంది.
3.మృత్తిక నీరు లోపలికి ప్రవేశించడం వల న మూలకేశాలలోని పదార్థాల గాఢత పెరుగుతుంది. దీని ఫలితంగా నీరు ప్రక్కనున్న కణాల కు ప్రవహించి వాటి గాఢతను కూడా పెంచుతుంది.
4. చివరగా నీరు దారు నాళాలలోకి చేరుతుంది.
5. ఎక్కువ సంఖ్యలో మూలకేశాలు మరియు వేరు కణాలు ఈ ప్రక్రియలో పాల్గొనుట వలన దారు నాళాలలో వేరు పీడనం ఏర్పడుతుంది.
6. ఈ పీడనం నీటిని పైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ పీడనాన్ని వేరు పీడనం అంటారు.
- ప్ర: దారువు ద్వారా మొక్కలలో నీటి రవాణా జరుగుతుందని తెలుపడానికి నీవు ఏ ప్రయోగం చేస్తావో వివరించుము. (AS-3)
మొక్కలలో దారువు ద్వారా నీటి రవాణా, పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు రవణా జరుగుతుంది. ఈ ప్రయోగ విధానము తెలుసుకొనుట కొరకు
1. కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకోవలెను.
2.భూమి ఉపరితలం కంటే 1 సెం.మీ పైన ఉండే విధంగా కాండ భాగాన్ని కోయవలెను. కోసిన భాగంలో గొట్టం బిగించాలి.
3. గాజుగొట్టం కాండం సమాన భాగంలో ఉండాలి.
4. గాజుగొట్టంలో కొన్ని నీళ్ళుపోసి మట్టం M ను గుర్తించాలి
5. 2-3 గంటల పాటు ఈ అమరికను కదపకుండా ఒకే చోట ఉంచాలి.
6. గాజు గొట్టంలో నీటి మట్టం పెరగటాన్ని గమనించవచ్చు.
7. వేరు పీల్చిన నీరు దారువు ద్వారా కాండ భాగానికి సరఫరా జరిగిందని నిర్థారించవచ్చు.
- ప్ర: ‘ప్రసరణ’ పాఠం ప్రకారం ప్రయాణ సమయాల్లోకాళ్ళ వాపు గురించి మీ పెద్దలకు ఏమి సలహాలు ఇస్తావు? (AS-6)
మనం చాలా సేపు బస్సుల్లోగాని, రైలులో గాని ప్రయాణం చేసిన తర్వాత కాళ్ళు ఉబ్బినట్లు అనిపిస్తుంది. ఎందుకనగా ప్రయాణ సమయంలో మనం కాళ్ళను ఎక్కువగా కదిలించం. అందువల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగదు. రక్తం చాలా నెమ్మదిగా ప్రవహించడం వలన రక్తం నుండి శోషరసం అధిక మొత్తంలో విడుదలవుతుంది. ఇదంతా పాదాలలో జమచేయబడి పాదాలు ఉబ్బినట్లు అనిపిస్తుంది. ఈ పరిస్థితిని ‘ఎడిమా’ అంటారు. అంతేకాకుండా కాళ్ళు కూడా తిమ్మిరి ఎక్కుతాయి. ఆ సమయంలో కొద్ది సేపు లేచి నిలబడితే మళ్ళీ మామూలు పరిస్థితి ఏర్పడుతుంది.
- గుండె అంతర్నిర్ణాణం పటం గీచి, భాగలను గుర్తించుము. (AS-5)
ఒక విద్యార్థి Low Cost No cost పరికారాలైన కాగితం టీ, కప్పును,సలైన్ గొట్టాలను ఉపయోగించి స్టెతస్కోపు తయారు చేశాడు. అతడు అనుసరించిన విధానం వ్రాయండి.
ఉద్ధేశ్యము: కాగితం టీకప్పులు, సలైన్ గొట్టాలను ఉపయోగించి స్టెతస్కోపు తయారు చేయుట. (AS-3)
పరికరాలు:- కాగితం టీ కప్పులు (3), సలైన్ గొట్టాలు/ప్లాస్టిక్ స్ట్రాలు (2)
ప్రయోగము:- విద్యార్థి మొదట 2 కాగితపు టీ కప్పులను తీసుకొని వాటి అడుగు భాగంలో చిన్న రంధ్రం చేశాడు సలైన్ గొట్టంను - రంధ్రంలో ఉంచి గమ్‌తో అతికించాడు. గొట్టం రెండవ చివర ఇంకొక కప్పును అతికించాడు. ఇపుడు ఒక కప్పును వ్యక్తి యొక్క ఛాతీ పైన ఉంచి ఇంకొక కప్పు సహాయంలో హృదయ స్పందనను వినవచ్చు.
ఫలితం: స్పష్టంగా హృదయం సంకోచ సడలికలను లబ్-డబ్ శబ్ధాల ద్వారా గుర్తించవచ్చును. 1 నిముషానికి సుమారు 60-80 హృదయ స్పందనలు వినవచ్చు.
- ప్ర: ఈ క్రింది పట్టికను పరిశీలించి దిగువ నివ్వబడిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. (AS-3)
క్రమసంఖ్య పేరు వయస్సు బి.పి లోడింగు రిమార్కు 1. భాస్కర్ 38 120/80 NBP 2. రాజేష్ 36 90/70 LBP 3. మధు 40 140/110 HBP 4. సుమన్ 45 150/120 HBP
ఎ) ఇచ్చిన సమాచారం విశ్లేషించిన తర్వాత నీవు గమనించిన విషయాలు ఏవి?
సుమన్ (45) , మధు (40) లకు రక్తపోటు అధికంగా ఉంది. రాజేశ్(36)కు రక్తపోటు తక్కువగా ఉంది.కాని భాస్కర్ (38) మాత్రం సాధారణ రక్తపీడనం (120/80) లో ఆరోగ్యంగా ఉన్నాడు.
బి) వయస్కుకు, రక్తపోటుకు సంబంధ మేమి?
సాధారణంగా 45 సం॥వయస్సు పై బడిన వారికి రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. వయస్సు పెరుగుతున్న వారిలో ధమనుల గోడలు దళసరిగా మారుతుంటాయి. అవి సాగే లక్షణాన్ని కోల్పోతూ ధమనులలో కుహారం చిన్నదవుతుంది.
సి) అధిక రక్తపీడనం,తక్కువ రక్తపీడనం వలన కలిగే పర్యవసానాలు ఏవి?
1. అధిక రక్తపోటు: వలన దీర్ఘకాలపు ఒత్తిడి, కోపం, చిరాకు కలుగుతాయి. మధ్యపానం, ధూమ పానం వల్ల హైబీపీ సంభవిస్తే మూత్ర పిండాలు, కాలేయం పై ఎక్కువ ప్రభావం పడుతుంది. రక్తంలో ఒక వేళ కొలెస్టాల్ పేరుకుపోతే మాత్రం హృదయ కండరాలకు ఆమ్లజని సహిత రక్తం అందక గుండె సక్రమంగా పనిచేయదు.
2. తక్కువ రక్తపోటు: కలిగి వారు చాలా నీరసంగా ఉంటారు. శరీర ఉష్ణోగ్రత సాధారణం (370C డిగ్రీల కంటే తక్కువ) ఉంటుంది. కాబట్టి శరీరం చల్లబడి స్పృహ తప్పి పోవచ్చు.
అందువలన హైబీపి, లోబీపీ లను నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి.
డి) లవము(పైరీడింగ్) దేనిని తెలియజేస్తుంది? హారం (క్రిందిరీడింగ్) దేనిని తెలియ జేస్తుంది?
లవము అనగా హృదయసంకోచం (సిస్టోల్), దీనిలో పీడనం 120 గా ఉంటుంది. హారము అనగా హృదయ సడలిక (డయాస్టోల్). దీనిలో పీడనం 80 గా ఉంటుంది.
7. ప్ర: రక్త పీడనం గురించి వివరంగా తెలుసుకోవాలంటే డాక్టరు గారిని కలిసి ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు. (AS-2)
రక్తపీడనం (బి.పి) గురించి వివరముగా తెలుసుకొనుటకు కార్డియాలజిస్టుగాని, జనరల్ ఫిజిషియన్‌ను సంప్రదించి ఈ క్రింది ప్రశ్నలు అడగవచు
1. అధిక రక్తపోటు(హైపర్‌టెన్షన్) ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది?
2. అధిక రక్తపోటు రావడానికి కారణం ఏమిటి?
3. అధిక రక్తపోటు సంభవిస్తే గుండె పనితీరు ఎలా ఉంటుంది? లేదా లక్షణాలు ఎలా ఉంటాయి?
4. అధిక రక్తపోటు సంభవించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
5. అల్పరక్తపోటు (LowB.P) ఏర్పడితే నష్టమేమిటి?
6. సాధారణ రక్త పీడనం(Normal B.P) కాపాడుకొనుటకు వ్యక్తి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
అలాగే ఈ పాఠం నుండి ‘ రక్తస్కందనం’ గురించి ప్రశ్నించమని కూడా అడిగే అవకాశం ఉండవచ్చు.
2 మార్కు ప్రశ్న జవాబులు
- వేరు పీడనం మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS-1)
జ: మొక్క వేరు భాగంలో అధిక సంఖ్యలో ఉన్న మూలకేశాలు, వేరు కణాలు నిరంతరం నీటిని పీల్చుకోవడం సహజం. ఈ నీరు దారనాళాలలో ఉన్న నీటిపై ఒత్తిడిని కలుగజేస్తుంది. ఈ ఒత్తిడిని వేరు పీడనం అంటారు. ఈ పీడనం నీటిని పైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ వేరు పీడనం వల్ల ఎత్తై చెట్లలో నీరు వేళ్ళద్వారా కాండం పై భాగాలకు పంపించడం వీలవుతుంది.
- భాష్పోత్సేకానికి, వర్షపాతానికి ఏమైనా సంబంధం ఉంటుందా తెల్పండి? (AS-1)
జ:రెండింటికి సంబంధం ఉంది. మొక్కలుసహజంగా నీటిని బాష్పోత్సేకం ద్వారా ఆవిరి రూపంలో వాతావరణంలోకి పంపుతాయి. వీటి వలననే అడవులలో గాలి ఎక్కువగా నీటి ఆవిరితో నిండి ఉంటుంది. నీటి ఆవిరితో నిండిన పవనాలు ఇటువైపుగా వీచేటప్పుడు అక్కడి వాతావరణంలో నీటి ఆవిరితో సంతృప్తం చెంది వర్షం కురుస్తుంది.
- ఎత్తై చెట్లలో జరిగే నీటి ప్రసరణ వ్యవస్థను ఎలా అభినందిస్తావు?(AS-6)
జ: మొక్కలు నేల నుంచి ఎక్కువ నీటిని వేర్లద్వారా గ్రహిస్తాయి. ఈ నీరు దారునాళాలలో ఉన్న నీటిపై ఒత్తిడి (పీడనం)ని కలుగజేస్తుంది. ఈ వేరు పీడనం నీటిని పైకి నెట్టడానికి సహకరిస్తుంది. ఇలా ఎత్తై చెట్లలో నీటి ప్రసరణ జరగడం ఆశ్టర్యంగా ఉంది. ఎటువంటి యంత్రాల సహాయం లేకుడా భూమిలోపల ఉన్న నీరు 100-150 మీ. ఎత్తువరకు ప్రవహించడం అంటే సామాన్య విషయం కాదు. మొక్కలలో ఉన్న కణజాలాలు దీనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. అలాగే పత్రరంధాల ద్వారా అవిరియైన నీటిని దారుకణాల నుండి వచ్చే నీరు పూరిస్తుంది. ఈ నీటి ప్రసరణ వ్యవస్థ అనేది ప్రకృతి మొక్కలకు ప్రసాదించిన గొప్ప వరం.
- హృదయ స్పందనకు, నాడీ స్పందనకు మధ్య గల సంబంధం ఏమిటి? (AS-1)
జ: హృదయస్పందన అనగా ఒక సంకోచం (సిస్టోల్), ఒక సడలిక (డయాస్టోల్). ఎడమ జఠరిక నుండి బయలు దేరే దైహిక మహాధమని అనేక శాఖోపశాఖలుగా చీలి శరీరమంతటా విస్తరించి రక్తాన్ని అందజేస్తూ ఉంటుంది. నాడీస్పందన చేతి మణికట్టు దగ్గర ఉన్న ధమనులలో ఏర్పడే కదలికల ఆధారంగా గుర్తిస్తారు. హృదయ స్పందనలోని సిస్టోల్, డయాస్టోల్‌ల ప్రతి రూపాలే మణికట్టు వద్ద ఉన్న ధమనుల కదలికలు.
- అధిక రక్తపీడనము నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు వ్రాయుము. (AS - 6)
1.45సం॥పైబడిన వారు ఏడాదికి రెండు సార్లయినా రక్తపీడనాన్ని పరీక్షించుకోవాలి.
2. ఆహార నియమాలు పాటిస్తూ, తగిన వ్యాయామం చేయడం అవసరం
3. ఒత్తిడి, శ్రమ తగ్గించుకొని ప్రశాంతంగా ఉండటం అవసరం.
4. ధూమపానం, మధ్యాన్ని సేవించకుండా ఉండటం వంటి మొదలైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
- సిస్టోల్, డయాస్టోల్ మధ్య తేడాలు వ్రాయండి. (AS-1)
సిస్టోల్
డయాస్టోల్
1.హృదయ స్పందనలో సంకోచదశను సిస్టోల్ అంటారు. 1. హృదయ స్పందనలో సడలే దశను డయాస్టోల్ అంటారు. 2. రెండు కర్ణికలు సంకోచం చెంది రక్తాన్ని జఠరికలకు పంపుతాయి. (కర్ణికా సిస్టోల్) తర్వాత జఠరికలు సంకోచిస్తా. (జఠరిక సిస్టోల్) 2. నాలుగు గదులు పూర్తి విశ్రాంతి స్థితికి వస్తాయి. దీనిని కర్ణికా-జఠరికా-డయాస్టోల్ అంటారు. 3. సిస్టోలిక్ పీడనం ఎక్కువగా ఉంటుంది. 3. డయాస్టోలిక్ పీడనం తక్కువగా ఉంటుంది. 4. ఆరోగ్య వంతునిలో సిస్టోల్ పీడనం 120 గ్రా ఉంటుంది. 4. ఆరోగ్య వంతునిలో డయాస్టోల్ పీడనం 80గా ఉంటుంది.
- హీమో ఫీలియా అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? (AS-1)
శరీరంలో ఏదైనా భాగానికి గాయం తగిలితే సాధారణంగా రక్తం గడ్డకట్టడానికి సుమారు 3 నుండి 6 నిమిషాల సమయం పడుతుంది. కాని కొందరు వ్యక్తులలో కె విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం పట్టవచ్చు. వంశపారంపర్యంగా జన్యులోపం ఉన్నటువంటి కొంత మందిలో రక్తం గడ్డకట్టడం జరుగదు. దీనినే హీమోఫీలియా అంటారు. ఈ వ్యాధి జన్యులోపం ఉన్న వారికి సంభవచ్చును.
- తలసేమియా వ్యాధి గురించి మీకు తెలిసనది వ్రాయుము. (AS-1)
1. తలసేమియా అనేది వంశపారం పర్యంగా వచ్చే రక్త సంబంధ వ్యాధి.
2. ఇది ఎర్రరక్త కణాలలో హీమోగ్లోబిన్ లోపించగా వచ్చే తీవ్రమైన వ్యాధి
3. 35 మిలియన్ల భారతీయులు ఈ వ్యాధి కలిగించే అసాధారణ జన్యువును కలిగిన వాహకులు.
4. మనదేశంలో ప్రతీ ఏటా 10 నుండి 12 వేల మంది పిల్లలు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు.
5. తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలం పెంచాలంటే రక్తమార్పిడి విలువైన మందులు అవసరము.
- రక్తంలోని హీమోగ్లోబిన్ ఏయే పనులు నిర్వర్తిస్తుంది? రక్తంలో హీమోగ్లోబిన్ లేని జీవుల శ్వాసక్రియలో రక్తం పాత్ర ఏమిటి? (AS-1)
రక్తంలోని హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ రక్తంలో ఆక్సీజన్ కలిసిన తర్వాత అన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. అలాగే కార్బన్ డై ఆక్సైడ్ వాయువును తిరిగి ఊపిరితిత్తులకు రవాణా చెందుటకు తోడ్పడును.రక్తతంలో హీమోగ్లోబిన్ లేని కొన్ని జీవుల్లో హీమోసయనిన్, హీమోఎరిత్రిన్ అనే శ్వాసవర్ణకాలు కలిగి ఉండి శ్వాసక్రియ జరుగుతుంది.
- మన శరీరంలో గల 3 ప్రధాన రక్తనాళాలను పేర్కొనుము. (AS-1)
1. మన శరీరంలో గల అతిపెద్ద సిరలు శరీర భాగలా నుండి రక్తాన్ని సేకరించి గుండెకు పంపిస్తాయి.
2. దైహిక మహాధమని: ఊపిరితిత్తులకు తప్ప మిగిలిన అన్ని శరీర భాగలకు ఆమ్లజని సహిత రక్తాన్ని అందిస్తుంది.
3. పుపుస మహాధమని: ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని అందిస్తుంది.
- గుండెపోటు అంటే ఏమిటి? (AS-1)
ఒక జత హృదయ ధమనులు ఆమ్లజని సహిత రక్తం (మంచిరక్తం) హృదయ కండరానికి తీసుకొని పోతాయి. వయస్సు మీరే కొద్దీకొంత మందిలో హృదయ ధమనులలో రక్తప్రసరణకు అవరోధాలు ఏర్పడతాయి. హృదయ కండరాలకు ఆమ్లజని సహిత రక్తం అందక గుండె పనిచేయదు. దీనినే ‘‘గుండెపోటు’’ అంటారు.
- రక్తఫలకికల యొక్క ఉపయోగాలు ఏవి? (AS-1)
రక్తఫలకికలు అనేది రక్తకణాలలో మూడవ రకానికి చెందినవి. ఇవి రక్త స్కందనక్రియను నిర్వహిస్తాయి. గాయం నుండి రక్తం కారుతున్నప్పుడు రక్తఫలికల నుంచి ధ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది రక్తంలో ఉన్న ప్రోథావబిన్ ను ధ్రాంబిన్‌గా మారుస్తుంది. ధ్రాంబిన్ రక్తంలోని ద్రవరూపంలో ఉన్న పైబ్రినోజన్‌ను ఫైబ్రిన్ పోగులు గాయం అయినచోట గుండ్రటి వల లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఈ పోగులలో రక్తకణాలు చిక్కుకుని స్కందనం ఏర్పడుతుంది.
1 మార్కు ప్రశ్న జవాబులు
- గుండె నుండి శరీరభాగాలకు రక్తన్ని చేరవేసే భాగాలు ఏవి?
జ: ఊపిరితిత్తుల నుండి గుండెకు చేరిన ఆమ్లజని సహిత రక్తం, గుండె నుండి ధమనుల ద్వారా శరీరభాగలకు సరఫరా అవుతంది. అవి.
1. దైహిక మహాధమని
2. పుపుస మహాధమని
3. ఒకజత హృదయ ధమనులు
- అజయ్ రక్తపీడనం 120/80 అని రాసి ఉంది ఇది దేనిని తెలుపుతుంది.
జ: ఇది అజయ్ ఆరోగ్యకరమైన రక్తపీడనం 120/80 ను సాధారణ రక్త పీడనము అంటారు. ఇందులో 120 ని సిస్టోలిక్ పీడనాన్ని, 80-డాయాస్టోలిక్ పీడనాన్ని తెలుపుతుంది.
- హృదయ స్పందన అనగా నేమి?
జ: హృదయం యొక్క ఒక సంకోచం (సిస్టోల్), ఒక సడలిక (డయాస్టోల్) ను కలిపి హృదయ స్పందన అంటారు. హృదయ స్పందనలో లబ్-డబ్ అనే శబ్ధం వస్తుంది.
- గుండె రక్షణ కవచాలు ఏవి?
జ: గుండెను చుట్టి రక్షణగా ఏర్పడిన రెండు పొరలను హృదయావరణ త్వచాలు (పెరికార్డియం లేయర్స్) అంటారు. ఈ రెండు పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది.
- ద్వివలయ రక్త ప్రసరణం అనగా నేమి?
జ: కొన్ని జంతువులలో రక్తం హృదయం నుండి రెండు సార్లు ప్రవహిస్తుంది. దీనినే ‘ద్వివలయ రక్తప్రసరణం’ అంటరు. ఉదా॥క్షీరదాలు, సరీసృపాలు పక్షులు.
- మానవుని గుండెలో ఎన్ని గదులున్నాయి? అవి ఏవి?
జ: మానవుని గుండెలో నాలుగు గదులుంటాయి. పూర్వభాగంలో 2 కర్ణికలు పరభాగంలో 2 జఠరికలు ఉంటాయి.
- రక్త స్కందనం అనగా నేమి?
జ: శరీరాలనికి గాయం తగిలినపుడు రక్తం కారుతుంది. కొద్దిసేపటి తర్వాత రక్తం గడ్డకట్టి తెగినచోట ఒక ఎర్రని గడ్డలా ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డనే రక్త స్కందనం అంటారు.
- హిమోఫీలియా అనగా నేమి?
జ: జన్యులోపం వలన కొంత మందిలో రక్తం గడ్డకట్టడం జరుగదు. ఈ లోపాన్ని హీమోఫీలియా అంటారు.
- ఎడిమా అనగా నేమి?
జ:ఎక్కువ సేపు కాలు కదలకుండా కూర్చున్నపుడు లేదా కాలు మీద కాలు పెట్టి కూర్చున్నప్పుడు. రక్తప్రసారం నెమ్మదిగా జరిగి, రక్తం నుంఇ శీషరసం రక్త నాళాల నుండి బయటికి వస్తుంది. ఇదంతా కాళ్ళలో జమ చేయబడి కాళ్ళలో వాపు ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎడిమా అంటారు.
- రక్తనాళాలలో ఉండే కవాటాల ఉపయోగం ఏమిటి?
జ: సిరలలో కవాటాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని ఒకే వైపునకు అనగా సవ్య దిశలో వెళ్ళడానికి అనుమతిస్తాయి.
- వంశపారం పర్యంగా వచ్చే రక్త సంబంధ వ్యాధులు ఏవి?
జ: హీమోఫీలియ, తలసేమియా
- గుండె పోటు సంభవించడానికి కారణం ఏమిటి?
జ:హృదయ ధమనుల గోడల లోపల కొలెస్టరాల్ పేరుకుపోవడం వల్ల లోపలి ఖాలీ తగ్గి రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. హృదయ కండర గోడలకు రక్తం అందకపోవడం వల్ల గుండెపోటు వస్తుంది.
- ఏక వలయ ప్రసరణ అనగా నేమి?
ఉదా॥ఇవ్వుము.
జ: హృదయం ద్వారా రక్తం ఒకేసారి ప్రవహించడాన్ని ‘‘ఏకవలయ రక్తప్రసరణం’’ అంటారు. ఉ॥చేపలు.
- రక్తపోటు అనగా నేమి?
జ: విశ్రాంతి సమయంలో సాధారణ రక్తపీడనం (120/80) కంటే ఎక్కువ రక్తపీడనం ఉన్నట్లయితే ఆ వ్యక్తికి రక్తపోటు(హైపర్‌టెన్షన్) ఉన్నట్లుగా భావిస్తారు.
- ధమనులను శాఖలుగా విస్తరించి చెట్టుతో పోలుస్తారు. ఎందుకు?
జ: ఎడమ జఠరిక నుండి అతి పెద్ద దైహిక మహాధమని బయలుదేరి అనేక శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఇది ధమనులుగా, ధమనికలు, కేశనాళికలుగా విడిపోయి శరీరంలోని కణజాలాలన్నింటికి ఆమ్లజని సహిత రక్తాన్ని అందిస్తుంది.
1/2 మార్కు ప్రశ్నజవాబులు
- క్రింది వానిలో ఏ భాగం రక్తప్రసరణను నియంత్రిస్తుంది. ( )
ఎ.ఇ ధమని
బి. సిర
సి. కేశనాళిక
డి.కవాటం.
- డాక్టర్ మీ నాడీస్పందనను పరీక్షించేటప్పుడు మీ మణికట్టులోని ఏ భాగం పై ఒత్తిడి పెడతారు. ( )
ఎ. సిర
బి.ధమని
సి.కేశనాళిక
డి. లింఫ్‌నాళాలు
- మానవునిలో సామాన్య రక్త పీడనం ( )
ఎ.100/20
బి. 120/80
సి.80/120
డి.70/110
- హృదయంలో శబ్ధం ఉత్పత్తి కావడానికి కారణం ( )
ఎ. త్రిపత్ర, ద్విపత్ర కవాటాలు మూసుకోవడం
బి. ధమని మరియు పుపుస కవాటాలు మూసుకోవటం
సి. కవాటాల ద్వారా వేగంగా రక్తం ప్రవహించడం
డి. రక్తం జఠరికలో ప్రవేశించడం
- మానవుని హర్థిక వలయంలోని వివిధ దశలను వరుసలో రాయండి ( )
ఎ. జఠరికల సంకోచం
బి. కర్ణికల సంకోటం
సి.జఠరికల సడలింపు
డి. కర్ణికల సడలింపు
ఎ. ఎబిసిడి
బి. బిఎడిసి.
సి. సిఎబిడి.
డి. డిసిబిఎ
- నాలుగు గదుల హృదయం గల జీవులు ( )
ఎ. ఉభయ జీవులు, సరీసృపాలు
బి. పక్షులు, క్షీరదాలు
సి. చేపలు, పక్షులు
డి. సరీసృపాలు, క్షీరదాలు
- ఎర్రరక్త కణాలు లేని జీవి ( )
ఎ. వానపాలు
బి. బొద్దింక
సి.కప్పలు
డి. సీతాకోకచిలుక
- ఉభయజీవుల్లో మహాసిరలు కలిసి ఏర్పడే భాగము ( )
ఎ. కుడికర్ణిక
బి. మహాధమని
సి.సిరాసరణి
డి. ఎడమకర్ణిక
- రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా చేసేది ( )
ఎ. క్లోరిన్
బి. అయోడిన్
సి.సోమాలిన్
డి. హెపారిన్
- తెల్లరక్తకణాల జీవిత కాలం ( )
ఎ. 14-15 రోజులు
బి.10-12 రోజులు
సి. 12-13 రోజులు
డి.15-20 రోజులు
- బి.పిని కొలిచే పరికరం ( )
ఎ. సిగ్మామానో మీటర్
బి. బారోమీటర్
సి.ధర్మామీటర్
డి.గాల్వనోమీటర్
- మనీష వేలు తెగినపుడు రక్తం గడ్డకట్టడానికి చాలా సమయం పట్టింది. దీనికి కారణం ఊహించండి. ( )
ఎ.విటమిట్-డి లోపం
బి. విటమిన్-కె లోపం
సి. మనిషి శరీరంలో రక్తం ఎక్కువగా ఉంది.
డి. మనిషి శరీరంలో రక్తం తక్కువగా ఉంది.
- అసంపూర్ణంగా విభజన చెందిన 4 గదుల హృదయం గల జీవి ( )
ఎ. పక్షులు
బి.ఉభయచరాలు
సి. క్షీరదాలు డి. సరీసృపాలు
- ఈ క్రింద చూపిన రక్తనాళంలో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది? ( )
ఎ. పుపుస ధమని
బి. హృదయ ధమని
సి. పుపుససిర
డి. హృదయసిర
- గబ్బిలం రెక్కలపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్త ( )
ఎ ఫాబ్రిసి
బి. మాల్పీజీ
సి. విలియం హార్వే
డి. లిన్నేయస్
జవాబులు:
1)డి 2)ఎ 3)బి 4)బి 5)బి 6)బి 7)ఎ 8)సి 9)డి 10)సి 11)ఎ 12)బి 13)డి 14)బి 15)బి
1)డి 2)ఎ 3)బి 4)బి 5)బి 6)బి 7)ఎ 8)సి 9)డి 10)సి 11)ఎ 12)బి 13)డి 14)బి 15)బి
ఖాళీలు:-
- స్టెతస్కోప్‌ను మొదటగా కనుగొన్న శాస్త్రవేత్త
- గుండెను అఘాతాల నుండి కాపాడేది..............
- హృదయ స్పందనను, నాడీస్పందనల మధ్యగల సంబంధాన్ని తెలియజేసేగ్రాఫ్..............
- సిరలలో కవాటాలను గుర్తించిన శాస్త్రవేత్త..............
- రక్తమును అధ్యయనం చేసే శాస్త్రం..............
- రక్తకణాల సంఖ్యను గుర్తించే పరీక్ష..............
- ఒక హార్థిక వలయం పూర్తి కావడానికి పట్టే సమయం..............
- జన్యులోపం వలన రక్తం గడ్డకట్టక పోవడాన్ని హీమోఫీలియా
- రక్త ప్రసరణ వ్యవస్థకు మరొక సమాంతర వ్యవస్థ..............
- రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్నది..............
- గుండెను గురించి అధ్యయనం చేసే శాస్త్రం..............
- రక్తం గడ్డకట్టుటకు..............సమయం పడుతుంది.
- రక్తఫలకికల నుండి ..............ఎంజైమ్ విడుదలవుతుంది.
- ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం హీమోగ్లోబిన్ స్థాయి ..............ఉండవలెను.
- రక్త స్కందనకు తోడ్పడే విటమిన్ ..............
- మూలకేశాల ద్వారా నీరు ప్రసరించు విధానం..............
- శరీరంలో అతిపెద్ద ధమని..............
- రక్తంలో ఉండే ..............రక్తస్కకదనను ప్రారంభిస్తాయి.
- శరీరంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉండే వ్యాధి ..............
- పత్రాల నుండి నీరు ఆవిరి అయ్యే ప్రక్రియ..............
జవాబులు:
1)రెనిలెన్నెక్; 2)హృదయావరణం (పెరికార్డియం); 3)హిస్టోగ్రామ్; 4)గైరోలమా ఫాబ్రిసి; 5) హెమటాలజీ; 6)హీమోగ్రామ్; 7) 0.8 సెకన్లు ;8)హీమోఫోలియా; 9)శోషరసవ్యవస్థ; 10)విలియం హార్వే ;11)కార్డియాలజి; 12) 3-6 నిమిషాలు; 13)థ్రాంబోకైనేజ్; 14) 115-120 గ్రా/లీ; 15) విటమిన్ కె.; 16)ద్రవాభిసరణం; 17)బృహద్ధమని; 18) రక్తఫలకికలు; 19)తలసేమియా ;20)భాష్పోత్సేకం .
జతపరుచుము
గ్రూప్-ఎ | | గ్రూప్-బి |
1.స్టెతస్కోప్ | ( ) | ఎ. విలియం హార్వే |
2. సిరలలో కవాటాలు | ( ) | బి. గైరోలమా ఫాబ్రిసి |
3. రక్తపీడనం | ( ) | సి. మార్సిల్లో మాల్పీజి |
4. రక్తప్రసరణం | ( ) | డి. రెని లెన్నిక్ |
5. గబ్బిలం రెక్కలు | ( ) | ఇ.స్పిగ్మోమానోమీటర్ |
|
| ఎఫ్. బారోమీటర్ |
జవాబులు:
1)డి; 2)బి ;3)ఇ; 4)ఎ; 5)సి.
గ్రూప్-ఎ | | గ్రూప్-బి |
1. రెండు గదుల హృదయం | ( ) | ఎ. హైడ్రా |
2. మూడు గదుల హృదయం | ( ) | బి. బొద్దింక |
3. నాలుగు గదుల హృదయం | ( ) | సి. చేప |
4. మిధ్యాశరీర కుహారం | ( ) | డి. కప్ప |
5. జఠర ప్రసరణ కుహారం | ( ) | ఇ. ఏలిక పాములు |
|
| ఎఫ్. కోతి |
#Tags