Telangana State Disaster Response and Fire Services: ఫైర్‌మన్‌కు శిక్షణ తేదీలు ఖారారు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖలో ఇటీవల భర్తీ అయిన ఫైర్‌మన్‌ల శిక్షణ మార్చి 13 నుంచి ప్రారంభం కానుంది.

రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్‌ సర్వీసెస్‌ అండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల నియామకాల్లో మొత్తం 599 మంది ఫైర్‌మన్‌ల ఎంపిక పూర్తయింది.

చదవండి: Constable Jobs: గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

వీరిలో ఇప్పటికే 499 మంది అభ్యర్థుల మెడికల్‌ పరీక్షలు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎంక్వైరీ కూడా పూర్తవడంతో వారందరికీ శిక్షణలో చేరేందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇంకో 108 మంది అభ్యర్థుల ఎస్బీ ఎంక్వైరీ, మెడికల్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. 

#Tags