పోలీసు శాఖ నోటిఫికేషన్ ఎప్పుడు?
తేలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ 16వేల పైచిలుకు పోస్టుల భర్తీకి అనుమతించిన విషయం తెలిసిందే. అయితే దశలవారీగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలా లేదంటే ఒకేసారి నియామకాలు చేపట్టాలా అనే అంశా లపై తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియ లో ప్రధాన భాగం జిల్లా కేడర్ స్థాయిగా ఉన్న కానిస్టే బుల్ పోస్టులే. వీటి కేటాయింపులపై ఇంకా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. మొత్తం పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేందుకు కూడా తాము ఏర్పా ట్లు చేసుకుంటున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
ఏయే జిల్లాల్లో ఎన్ని...:
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు తోడు రాష్ట్రపతి ఉత్తర్వులతో ఏర్పడిన రేంజ్‌ల వారీగా సివిల్, ఏఆర్ కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను కేటాయించాల్సి ఉంది. వీటి కేటాయింపులపై సంబంధిత జిల్లాలు, కమిష నరేట్ల నుంచి పూర్తిస్థాయి సమాచారం రాలేదని అధి కార వర్గాలు వెల్లడించాయి. లోకల్ కేడర్ పోస్టులుగా 8,500 కానిస్టేబుల్, రేంజ్ కేడర్‌లో 525 ఎస్‌ఐ పోస్టులను భర్తీచేయాల్సి ఉంది. ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలను నోటిఫై చేశారు, కమిషనరేట్లకు, జిల్లాలకు ఎంతమేరకు అవసరం అన్న అంశాలపై మరింత స్పష్టత తీసుకునే పనిలో పోలీస్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది.
నెలాఖరుకల్లా నోటిఫికేషన్:
పోస్టుల కేటాయింపులు, నియామక ప్రక్రియలో చేపట్టాల్సిన కార్యాచరణ మరో పది పదిహేను రోజుల్లో పూర్తవుతుందని ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి రిక్రూట్‌మెంట్ బోర్డుకు వచ్చేవారంలో ఆదేశాలు రావచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ఈ రెండు అంశాల్లో స్పష్టత వస్తే ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి.