TSAT: టి–శాట్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అవగాహన

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టు లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అవగా హన కల్పించేందుకు రోజూ ఉదయం 11 గం టల నుంచి టి–సాట్‌ లో ప్రత్యేక లైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఈవో శైలేష్‌రెడ్డి స్పష్టంచేశారు.
టి–శాట్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అవగాహన

అభ్యర్థుల సందేహాలకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు సమాధానాలివ్వనున్నారని ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 040–23540326, 23540 726, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 4039కు కాల్‌ చేయాలని సూచించారు. అలాగే పోలీసు ఉద్యోగార్థులకోసం ‘టి–సాట్‌ నిపుణ’లో ఉదయం 8 నుంచి10 గంటల వరకు, ‘విద్య చానల్‌’లో సాయంత్రం 8నుంచి 10గంటల వరకు ప్రత్యేక పాఠ్యాంశ ప్రసారాలు ప్రారంభిస్తున్నట్లు సీఈవో తెలిపారు. అభ్యర్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ‘మనోమిత్ర’ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసారం చేస్తున్నామని శైలేష్‌రెడ్డి వెల్లడించారు.

చదవండి:​​​​​​​ పోలీస్ గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | వీడియోస్

#Tags