Job Promotions: 175 మంది జేఎల్‌ఎంలకు పదోన్నతి

ఖమ్మం వ్యవసాయం: ఎన్పీడీసీఎల్‌ ఖమ్మం సర్కిల్‌ పరిధిలో 175 మంది జూనియర్‌ లైన్‌మెన్ల(జేఎల్‌ఎం)కు అసిస్టెంట్‌ లైన్‌మెన్లు(ఏఎల్‌ఎం)గా పదోన్నతి లభించింది.

ఈ ప్రక్రియ ఆగ‌స్టు 15న‌ మొదలుకాగా సర్కిల్‌ పరిధిలో 198 మందిని పదోన్నతికి అర్హులుగా గుర్తించారు. డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) ఆధ్వర్యాన ఎస్‌ఈ సురేందర్‌ పర్యవేక్షణలో ఖమ్మం సర్కిల్‌ కార్యాలయంలో జాబితాను పరిశీలించి శాఖా పరమైన ఆరోపణలు ఉన్న 17మంది మినహా మిగతా వారికి పదోన్నతులు కల్పిస్తూ ఆగ‌స్టు 16న‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఎంఆర్టీ డివిజన్‌లో మరో ఆరుగురికి తాత్కాలికంగా పదోన్నతి నిలిపివేయగా మొత్తంగా 175మందికి అవకాశం దక్కింది.

అయితే, ఈ ఆరుగురికి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు అందే అవకాశముందని తెలుస్తోంది. డివిజన్ల వారీగా ఖమ్మం టౌన్‌లో 51మందికి, సత్తుపల్లి డివిజన్‌లో 41 మందికి, ఖమ్మం రూరల్‌లో 67 మందికి, వైరాలో 16 మందికి పదోన్నతి లభించింది.

వైరా డివిజన్‌ ఎర్రుపాలెం సెక్షన్‌ పరిధిలో విద్యుత్‌ మీటర్ల వ్యవహారమై అక్రమాలు జరిగిన నేపథ్యాన పలువురు జేఎల్‌ఎంలకు పదోన్నతి నిలిచిపోయినట్లు సమాచారం.

చదవండి: Job Chart and Promotions : ఉద్యోగులకు జాబ్‌ చార్టు, ఉద్యోగోన్నతులపై ఆత్మీయ స‌మావేశం..

ఇతర కేటగిరీలపై...

ఎన్పీడీసీఎల్‌లోని పలు కేటగిరీల ఉద్యోగులకు పదో న్నతి విషయమై సీఎండీ కె.వరుణ్‌రెడ్డి శుక్రవారం ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యా రు.

సర్కిల్‌, కార్పొరేట్‌ స్థాయిలో పదోన్నతుల అంశంపై చర్చించగా.. డ్రైవర్లు, టెలిఫోన్‌ ఆపరేటర్లను ఇతర విధుల్లో వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సీఎండీ చెప్పారని తెలిసింది.

లైన్‌మెన్లు, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎఫ్‌ఎల్‌ఐ, ఫోర్‌మెన్లు, ఏఓలు, ఏఏఓ లు, జేఏఓల పదోన్నతులు సర్కిల్‌ స్థాయిలో, సబ్‌ ఇంజనీర్లు మొదలు ఏఈలు, ఏడీఈలు, డీఈలు, ఎస్‌ ఈలు, ఆపై కేటగిరీల ఉద్యోగులకు కార్పొరేట్‌ పరిధి లో నిర్వహిస్తామని వెల్లడించినట్లు సమాచారం.

ఉద్యోగుల సంబురాలు

సత్తుపల్లి టౌన్‌: సత్తుపల్లి డివిజన్‌లో 41 మంది జూని యర్‌ లైన్‌మెన్లకు పదోన్నతి లభించడంతో 1104 యూనియన్‌ ఆధ్వర్యాన స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు.

డివిజన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొలిసి స్రవంతితో పాటు రమణ, ఎం.రాము, వి.రామారావు, వి.శ్రీరాం, టి.లక్ష్మణ్‌రావు, నాగేశ్వరరావు, రాజేష్‌, అశోక్‌రెడ్డి, జమీల్‌, రవి, హరీష్‌, రమేష్‌, పవన్‌, ఖాసీం, హనీఫ్‌ పాల్గొన్నారు.

#Tags