TS Inter Public Exams Results 2024 Release Date : ఏప్రిల్‌ 25వ తేదీ లోపు ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఈసారి రిజల్డ్స్‌ను ఇలాగే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ఏప్రిల్‌ 25లోగా విడుదల కానున్నాయి. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సాంకేతికపరమైన అంశాలను ఇంటర్‌ బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారు.

దీనికి వారంరోజులు పట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. పరీక్ష రాసిన వారు, గైర్హాజరైన వారు, మాల్‌ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన విద్యార్థుల డేటాను కంప్యూటరీకరించాల్సి ఉంటుంది. దీంతో పాటు వ్యాల్యూయేషన్‌లో వచ్చిన మార్కులను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

☛ AP Tenth and Inter Exams Results 2024 Dates : ఇంటర్, పది ఫలితాల విడుద‌ల‌ తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..

ఇది చేపట్టిన రెండు రోజుల్లో పరీక్ష ఫలితాలు..
తర్వాత మార్కుల జాబితా సక్రమంగా ఉందా? సాంకేతికపరమైన సమస్యలున్నాయా? అనే అంశాలను ఒకటికి రెండు సార్లు ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. సమాధాన పత్రాలను మూల్యాంకనకు పంపే ముందు ఓఎంఆర్‌ షీటును తొలగిస్తారు. వాటికి కోడింగ్‌ నంబర్‌ ఇస్తారు. ఇప్పుడు ఈ కోడ్‌ను డీ కోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది చేపట్టిన రెండు రోజుల్లో పరీక్ష ఫలితాలను వెల్లడిస్తారు.  తెలంగాణ ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల 2024 ఫ‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.

చ‌ద‌వండి: After‌ Inter MPC‌: ఇంజనీరింగ్‌తోపాటు వినూత్న కోర్సుల్లో చేరే అవకాశం.. అవకాశాలు, ఎంట్రన్స్‌ టెస్టుల వివ‌రాలు ఇలా..

ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో..
ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్‌ 21వ తేదీ నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు. ఉగాది పండుగ తర్వాత ఉన్నతాధికారులు సమావేశమై ఫలితాల వెల్లడిపై తేదీని ఖరారు చేస్తారని సమాచారం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో అధికారులే ఫలితాలు వెల్లడిస్తారు. దీనికి ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.

చ‌ద‌వండి: Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!

#Tags