Telangana Inter 1st Year Results : జూన్ 15 తేదీన‌ ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ రిజ‌ల్ట్స్‌..? డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా కొన‌సాగుతోంది. ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి.
Telangana Inter 1st Year Results Date

దీంతో జూన్ 15 తేదీలోగా  ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ ఫలితాలను విడుద‌ల చేయాల‌ని తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్‌ బోర్డ్ ధృడ‌ నిశ్చయంతో ఉంది. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెల్సిందే. తెలంగాణ ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ ( www.sakshieducation.com ) లో చూడొచ్చు.

How to check TS Inter 1st Year 2022 Results:

  • Visit results.sakshieducation.com or education.sakshi.com
  • Click on TS Inter 1st year results - General / Vocational on the home page
  • In the next page, enter your hall ticket number and submit
  • The results will be displayed on the screen.
  • Save a copy of the marks sheet for further reference.

ఇంట‌ర్ ఫస్టియర్ ప‌రీక్ష‌ల‌కు..
ఈ సారి ఇంట‌ర్ ఫస్టియర్ ప‌రీక్ష‌ల‌కు 4,64,626 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. అలాగే ఈ ప‌రీక్ష‌ల‌కు 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి..,  25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల‌ను ఏర్పాటు చేసి ప‌టిష్టంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఇలా.. 
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా కరోనాతో విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్న విష‌యం తెల్సిందే.
అలాగే ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. అలాగే ఈ సారి ఇంటర్ ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో ఈ సారి జ‌రిగిన ఇంట‌ర్ ఫస్టియర్ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

ఫస్టియర్‌

తేదీ

పరీక్ష

6–5–22

ద్వితీయ భాష

9–5–22

ఇంగ్లిష్‌

11–5–22

మ్యాథ్‌స్ –1ఎ, బాటనీ, పొలిటికల్‌ సైన్స్

13–5–22

మ్యాథ్‌స్ –1బి, జువాలజీ, హిస్టరీ

16–5–22

ఫిజిక్స్, ఎకనామిక్స్‌

18–5–22

కెవిుస్ట్రీ, కామర్స్‌

20–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు–మ్యాథ్‌స్

23–5–22

మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

#Tags