Intermediate Admissions 2024-25: ఇంటర్‌ అడ్మీషన్లకు చివరి తేదీ ఇదే.. మరోసారి నో ఛాన్స్‌!

ఇంటర్‌ అభ్యర్థులకు అలర్ట్‌. ఈ ఏడాది 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్‌ అడ్మీషన్ల గడువు తేదీని ఇంటర్‌ బోర్డ్‌ మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇంటర్‌ ప్రవేశాలకు రేపటితో గడువు ముగియనుంది. అయితే విద్యార్థుల కోరిక మేరకు మరోసారి గడువు తేదీని సెప్టెంబర్‌ 9 వరకు పొడిగించారు.

Job Mela: రేపే జాబ్‌మేళా.. నెలకు రూ. 25వేల వరకు జీతం

విద్యార్థులు ఆలోగా జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశం పొందాలని, మరోసారి గడువు పొడిగింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే చివరి అవకాశం అని పేర్కొన్నారు.ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెట్, అన్ ఎయిడెట్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ, కేజీబీవీ, టీఎమ్ఆర్జేసీ, టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో రెండేళ్ల ఇంటర్ కోర్సులు అందిస్తున్నారు.

PhD Admissions: పీహెచ్‌డీ ప్రవేశాలు.. 'నెట్‌' పరిధిలో చేర్చొద్దంటూ వర్సిటీల నిర్ణయం

విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని ఇంటర్‌ బోర్డ్‌ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు అఫీషియల్‌ వెబ్‌సైట్‌ tgbie.cgg.gov.in ను సంప్రదించాలని కోరింది.

#Tags