Tribal Primary Schools: ‘బడి’ తలుపులు తెరిచేదెప్పుడు..?

తిర్యాణి(ఆసిఫాబాద్‌): గిరిజనులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏకోపాధ్యాయ గిరిజన ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తోంది.

వాటి నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివాసీలకు విద్య అందని ద్రాక్షగా మారుతోంది. తిర్యాణి మండలం గుండాల గ్రామ పంచాయతీ పరిధిలోని అర్జుగూడలోని గిరిజన సంక్షేమశాఖ ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు రాజేశ్వర్‌ జూలై 6న మృతి చెందారు. ఇప్పటివరకు ఆయన స్థానంలో మరో ఉపాధ్యాయుడిని నియమించలేదు.

చదవండి: Penugonda ZP High School: పరదా కడితే.. పడదా?
అలాగే పూనగూడ స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయురాలు శాంత ఇటీవల బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లారు. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో ఈ రెండు పాఠశాలలు మూతబడ్డాయి. దాదాపు 40 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఈ విషయంపై ఎస్‌ఆర్పీ యశ్వంత్‌రావును వివరణ కోరగా.. ఉపాధ్యాయ ఖాళీలపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామని తెలిపారు. ఖాళీ స్థానాల్లో ఇద్దరు టీచర్లు చేరుతారని వెల్లడించారు.

#Tags