TS SSC Exam Fee Due Dates: ‘పది’ పరీక్షలకు ఫీజు ఖరారు

  • ఒక్కో విద్యార్థి రూ.125 చెల్లించాలి
  • అపరాధ రుసుం లేకుండా నేటి వరకు అవకాశం 
  • రూ.50 అపరాధ రుసుంతో 15 వరకు గడువు 
  • రూ.200తో 23 వరకు అవకాశం 
  • రూ.500 ఫైన్‌తో జవనరి 4 వరకు గడువు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి విద్యనభ్యసించే విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలు రాయడానికి చెల్లించే ఫీజు తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ వరకు అపరాధరుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. రూ.50 నుంచి రూ.500 వరకు అపరాధ రుసుం చెల్లించి జనవరి 4వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించేందుకు అవకాశం ఇస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి రూ.125 ఈనెల 8 వరకు సబ్‌ట్రెజరీలో జమచేసి, విద్యార్థుల వివరాలను ఈనెల 11, 12వ తేదీల్లో డీఈవో ఆఫీస్‌లో సమర్పించాలని సూచించింది. గతంలో సబ్‌ట్రెజరీ చలానా సాధారణ విధానంలో ఎంట్రీ తీసుకోవాల్సి ఉండగా ఈ ఏడాది పరీక్ష విభాగం వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పాఠశాల కోడ్‌ను ఎంటర్‌ చేయగానే చలానా ప్రింట్‌ తీసుకుని బ్యాంకులో డబ్బులను జమచేస్తే సరిపోతుంది. విద్యార్థుల వివరాలను ఎన్‌ఆర్స్‌లో పొందుపరిస్తే సరిపోతుంది.

చ‌ద‌వండి: TS 10th Class TM Study Material

ఫీజు మినహాయింపునకు అవకాశం
పదోతరగతి పరీక్ష ఫీజు రూ.125 లేకుండా పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పరీక్షల బోర్డు వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.24వేల లోపు, అర్బన్‌ ఏరియాలో రూ.20వేల లోపు ఉండి, 25 ఎకరాల భూమి తడి నేల, 5 ఎకరాల పొడి నేల కంటే ఎక్కువగా కాకుండా ఉంటే ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125 కాగా మూడు అంతకంటే తక్కువ సబ్జెకులకు పరీక్ష రాసే వారికి రూ.110, మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువ పరీక్ష రాసే వారికి రూ.125, ఒకేషనల్‌ విద్యార్థులకు రెగ్యులర్‌ విద్యార్థుల కంటే అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.

#Tags