Rathore Mirabai: ఆడపిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి..

ఆదిలాబాద్‌ టౌన్‌: 2002 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన రాథోడ్‌ మీరాబాయి ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని మారుమూల గ్రామం తిప్పా, లోకారిలో పనిచేశారు.

ప్రస్తుతం తంతోలి యూపీఎస్‌ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆడపిల్లల చదువుపైనే ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

బాలికల డ్రాప్‌అవుట్‌ లేకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడి మానేసిన వారిని తిరిగి బడిలో చేర్పించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు.

చదవండి: Kavita Teacher: ఆటపాటలతో పాఠాలు.. కవిత టీచర్‌ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం

లోకారిలో పనిచేసేటప్పుడు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి సర్కారు బడిలో చేర్పించారు. పాఠశాల ఆవరణలో బడితోట ఏర్పాటు చేసి అక్కడ పండిన కూరగాయలు, ఆకుకూరలను విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు.

#Tags