PSHM Association: పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు వీరికి ఇవ్వాలి
గద్వాల న్యూటౌన్: మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం లేదా పీఎస్‌హెచ్‌ఎంలకు ఇవ్వాలని పీఎస్‌హెచ్‌ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ అన్నారు.

సెప్టెంబర్ 16న స్థానిక జ్ఞానప్రభ జూనియర్ కళాశాలలో పీఎస్‌హెచ్‌ఎం అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు, 50శాతం పీఆర్‌సీ ఇవ్వాలని చెప్పారు.
ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక పీఎస్‌హెచ్‌ఎం, ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రవీణ్‌కుమార్, సోమసుందర్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుడిగా జయచంద్ర, ప్రధానకార్యదర్శి మురళీధర్, కోశాధికారి సురేష్‌బాబు, మహిళా ఉపాధ్యక్షులు సుజాత, గౌరవ అద్యక్షులుగా మునిస్వామి, వెంకటకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో యోగేందర్, అయ్యస్వామి, బుడ్డన్న, చంద్రశేఖర్, ఆంజనేయులు, హుస్సేన్, మమతా, విజయలక్ష్మీ, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీనాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
#Tags