Learning Improvement Programme: అభ్యసన అభివృద్థె లక్ష్యం

విద్యారణ్యపురి: సాధారణంగా ప్రతి విద్యార్థి పైతరగతిలో ప్రవేశం పొందిన సమయంలో ఆయా తరగతుల (కింది) అభ్యసన సామర్థ్యాలు కలిగి ఉండాలి.

కానీ కొందరు విద్యార్థులు ఇవే మీ సాధించకుండానే పైతరగతుల్లో ప్రవేశం పొందుతు న్నారు. ఈ పరిస్థితిని అధిగమించి ఆయా విద్యార్థుల్లో అభ్య సన సామర్థ్యాల పెంపుదలే లక్ష్యంగా రూపొందించిన 'లె ర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్'ను హనుమకొండ జిల్లా లో అమలు చేయడానికి అధికారులు ఇటీవల ఉపక్రమించారు.

ఇందులో భాగంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశానుసారం ప్రభుత్వ యాజమా న్యంలోని ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ స్కూల్స్, కస్తూర్బా విద్యాలయాలు, తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థు లకు 'అభ్యసన అభివృద్ధి కార్యక్రమం' (ఎల్ఎస్ఐపీ) అమలు పరుస్తున్నారు.

చదవండి: Canada Immigration Policy Changes: కెనడాలో 70 వేల మంది విద్యార్థులపై బహిష్కరణ కత్తి.. ఇమిగ్రేషన్‌ విధానాల్లో మార్పులు

తర గతి, సబ్జెక్టు వారీగా నిర్దేశించిన అభ్యసన ఫలితాలు సాధించడానికి, నాణ్యమైన విద్య పెంపొందించడానికి 2024 - 25 విద్యాసంవత్సరంలో 'లిప్' (ఎల్ఎస్ఐపీ) చేపడుతున్నారు. కాగా, 2023 - 24 విద్యా సంవత్సరంలోనే ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చినా అమలు సాధ్యం కాలేదు.

ఉపాధ్యాయులపై రికార్డుల భారం అధికంగా ఉండడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర య్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 'అభ్యసన అభివృద్ధి కార్యక్రమం' సరళ తరం చేసి విద్యార్థుల్లో ఆశించిన ఫలితాలు సాధించేలా ఈ విద్యాసంవత్సరం లో 'లిప్' కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కాగా హనుమకొండ జిల్లాలో హైస్కూల్స్, మోడల్ స్కూల్స్, కేజీబీబీలు కలిపి మొత్తం 143 ఉన్నాయి.

అభ్యసన అభివృద్ధికి ఉపాధ్యాయులు చేయాల్సిన అంశాలు

  • ప్రతి ఉపాధ్యాయుడు విధిగా 6 నుంచి 9వ తరగతి వరకు బోధించే సబ్జెక్టుల వార్షిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. 
  • ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టీచర్ డైరీని తరగతి, పీరియడ్, సబ్జెక్ట్, పాఠ్యాంశం- ఉప భావనలు, సంబంధిత పాఠ్యాంశ బోధన ద్వారా విద్యార్థులలో సాధించే అభ్యసన ఫలితాలను (లె ర్నింగ్ అవుట్ కమ్స్) పొందుపరచుకుంటూ రాయాల్సింటుంది.
  • సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వీయ పరిశీలన పం (సెల్ప్ అప్రైజల్ ) నమోదు చేసుకుని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో పొందుపరచాలి .
  • ప్రతి విద్యా సంవత్సరంలో 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల అభ్యసన స్థాయిలను తెలుసుకునేందుకు ప్రతి మూడు మాసాలకు ఒకసారి పరీక్షలు నిర్వహించి స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయాలి. ఈనెలలో ప్రారంభ పరీక్ష( బేస్ లైన్), డిసెంబర్ చివరలో మధ్యంతర పరీక్ష(మిడ్లైన్), మార్చిలో అంత్య పరీక్ష(ఎండైన్) నిర్వహించి విద్యార్థుల ప్రగతిని నమోదు చేయాల్సింటుంది.
  • ప్రతి విషయ వారీగా నిర్దేశించిన బోధన సోపానాలు అనుసరించి బోధన చేయాలి. ఉపాధ్యాయుడు సంబంధిత తరగతికి నిర్దేశించిన కనీస సామర్థ్యాలు ప్రతి విద్యార్థి సాధించేలా బోధన పద్ధతులను (టీ చింగ్ మెథడ్స్) అనుసరించొచ్చు.
  • ప్రతి సబ్జెక్టు వారీగా ఈ కార్యక్రమం అమలులో సంబంధిత ఉపాధ్యా యులు అనుసరించాల్సిన విధివిధానాలను ఉత్తర్వులలో సూచించిన మేరకు అనుసరించాలి.
  • ఉపాధ్యాయుడు బోధిస్తున్న సమయంలో నిర్దేశించిన పరిశీలన పత్రా లను అనుసరించి ప్రధానోపాధ్యాయులు లేదా పరిశీలనాధికారి పరిశీలించి నమోదు చేయాలి.
  • ప్రస్తుతం కార్యక్రమం అమలులో సంబంధిత తరగతికి నిర్దేశించిన అభ్యసన ఫలితాలు సాధించడంతోపాటు నిర్ణీత సమయంలోగా విధిగా అన్ని తరగతుల సిలబస్ పూర్తి చేయాలి.

ఎల్ఐపీపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాలో అభ్యసన అభివృద్ధి (ఎల్ఎస్ఐపీ) కార్యక్రమాన్ని ప్రధా నోపాధ్యాయులు ప్రథమ పర్యవేక్షకులుగా పరిశీలించాలి. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు ప్రధానోపాధ్యా యులకు తెలిపాం. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల నోడల్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు సాధించడంలో ఎలాం టి ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకుని బోధన చేపట్టాలి. టీచర్ సపోర్టు గ్రూపు విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపేలా పర్యవేక్షిస్తూ జిల్లాలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేస్తాం.
- డి.వాసంతి, డీఈఓ, హనుమకొండ
బోధన ప్రణాళికలు అవసరం
జిల్లాలో అభ్యసన అభివృద్ధికి బోధనకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సింటుంది. నిరంతరం పర్యవేక్షి స్తూ, విద్యార్థుల సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రధానోపాధ్యా యులు, మానిటరింగ్ అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో పర్యవేక్షణ అంశాలను పొందుపరచాలి. ఉపాధ్యాయు లకు అవసరమైన మార్గనిర్దేశం ఎప్పటికప్పుడు చేస్తాం. దీనికోసం పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తాం. ఇప్పటికే జిల్లా లోని పాఠశాలల్లో ఎస్సీఆర్టీ రూపొందించిన ప్రశ్న పత్రాలతో బేస్ లైన్ పరీక్షలు నిర్వహించాం.
- ఏ. శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్, హనుమకొండ
 

#Tags