Government Teachers Transfers and Promotions 2024 : టీచ‌ర్లుకు గుడ్‌న్యూస్‌.. బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుద‌ల‌.. రూల్స్ ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న టీచ‌ర్లుకు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో పనిచేస్తున్న ప్ర‌భుత్వ‌ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్‌ విడుదలైంది.

జూన్ 8వ తేదీ (శనివారం) నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మూడేళ్లలోపు పదవీ విరమణ చేయాల్సిన టీచర్లకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు లభించింది. 

టెట్‌తో సంబంధం లేకుండానే..
మల్టీ జోన్‌ 1లో జూన్ 8వ తేదీ నుంచి జూన్‌ 22 వరకు, మల్టీ జోన్‌ 2లో జూన్‌ 30 వరకు బదీలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుంది. మల్టీ జోన్ 1 ప్ర‌క్రియ‌ మొత్తం 15 రోజుల వ్యవధిలో ప్రక్రియ పూర్తి కానుంది. అలాగే మల్టీ జోన్ 2 లో జూన్ 8 నుంచి 30 వరకు ప్రక్రియ సాగనుంది. ఇందులో ఏకంగా 23 రోజులలో పూర్తి ప్రక్రియ జరగనుంది.

ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే.. 
కోర్టు కేసులతో గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభం కానుంది. టెట్‌తో సంబంధం లేకుండానే ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే మరో 19 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

#Tags