Government Jobs: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, చివరి తేదీ ఎప్పుడంటే..
హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC), వివిధ పోస్టుల భర్తీ కోసం డిప్యుటేషన్‌పై పనిచేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల సంఖ్య: 6
పోస్టుల వివరాలు:
1. ముఖ్య సమాచార అధికారి(chief information officer)
2. ప్రధాన సమాచార భద్రతా అధికారి(chief information security officer)
3. సీనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ (senior network administrator)
4. జూనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ (junior network administrator)
5. సీనియర్ ప్రోగ్రామర్ (senior programmer)
6. జూనియర్ అడ్మినిస్ట్రేటర్(junior programmer)
NEET 2024 Results: ఇన్ని లక్షల ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు!
అర్హత: సంబంధిత విభాగంలో కంప్యూటర్ సెన్స్ విభాగంలో ఎంటెక్ లేదా MCA లేదా MSCతో పాటు 3-5 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి
వేతనం: పోస్టును బట్టి రూ. 42,300- 1,58,380 వరకు ఉంటుంది.
అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్స్‌ను హైదరాబాద్, ప్రతిభా భవన్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: జూన్ 20, 2024