Bhatti Vikramarka On DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే 6వేల పోస్టులతో మరో డీఎస్సీ

సాక్షి,  హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలోనే రాష్ట్రంలో ఐదు లేదా ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీని నిర్వహిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో డీఎస్సీ పోస్టోపోన్‌ చేయాలని అక్కడక్కడా ధర్నాలు, వినతులు చూస్తున్నాం. డీఎస్సీ ఆలస్యమైతే మరింత నష్టం జరుగుతుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేపర్‌ లీకేజీలు, పరీక్షల రద్దు అందరం చూశాం. డీఎస్సీ పరీక్షకు అభ్యర్థులు హాజరు అవ్వండి. త్వరలోనే ఐదు లేదా ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీని నిర్వహిస్తాం. ఈసారి పరీక్షల కోసం ఇప్పటికే రెండు లక్షల మంది అభ్యర్థులు హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు’ అని తెలిపారు.

Engineering Counselling: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఆప్షన్స్‌కు నేడే చివరి తేదీ.. కోరుకున్న కాలేజీలో సీటు రావాలంటే..

ఎవరు ఆందోళన చెందవద్దు. మీరు అందరూ ఉద్యోగాలు తెచ్చుకుని స్థిరపడాలనేదే మా ఆశ.  కొన్ని నెలల తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది.  మీ భవిష్యత్‌ని కాంక్షించే ప్రభుత్వం ఇది. రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం.  ఈ రాష్ట్రం సర్వతోముభివృద్ధి జరగాలి ఇక్కడ వనరులు ఇక్కడే ఉపయోగపడాలి అని తెలంగాణ ఇచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 30,000 మందికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్ ఇచ్చింది.

Students Education Loans 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎడ్యుకేషన్ లోన్ కావాలా మీకు..!

పదేళ్లు ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రూప్-1 నిర్హహించలేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేము రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. ఎన్నికలు సమీపించాయి, అయినప్పటికీ కూడా ఆ సమయంలో ప్రకటన చేసి కావాలని ఆలస్యం చేస్తే కూడా మేము, అదనపు పోస్టులు కలిపి 11,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.  మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, విద్యావ్యవస్థ మీద దృష్టి సారిస్తే దాదాపు 16,000 పోస్టులు కాళీగా ఉన్నట్లు తెలిసింది. నిర్లిప్తతంగా ఉన్న విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడంలో భాగంగా డీఎస్సీని త్వరిత గతిన పూర్తి చేయాలని నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు పోతున్నాం అని తెలిపారు. 
 

#Tags