Success Story of CBSE 10th Ranker Sreeja : చిన్నతనంలోనే తండ్రి వదిలేసినా.. సీబీఎస్ఈ టెన్త్‌లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా.. వీరి ప్రోత్సాహంతోనే..!
విద్యార్థులు తల్లిదండ్రులు వారి చుట్టూ ఉన్నప్పుడే కొందరు సరిగ్గా చదవరు. పిల్లలు తప్పు చేసిన, వారికి ఒక పాఠం నేర్పాలన్నా అది మొదట తల్లిదండ్రుల వల్లే సాధ్యం అవుతుంది. కాని, ఇక్కడ అలా కాదు. 2022లో సీబీఎస్ఈ పరీక్షల్లో పదో తరగతి చదువుతున్న శ్రీజ అనే విద్యార్థిని బీహార్‌కు చెందినది. అయితే, తాను కష్టపడి చదవగా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచి 99.4శాతం మార్కులను సాధించింది. ఈ మార్కుల వెనకు ఉన్న కృషి, బాధ, కష్టం ఎంటో.. అసలు శ్రీజ కథేంటో తెలుసుకుందాం..
Teachers Family Success Story: ఐదుగురు ఆడపిల్లలు.. ఇంటినిండా టీచర్లు!’ ‘వీళ్లది టీచర్స్ ఫ్యామిలీ’
బీహార్‌కు చెందిన విద్యార్థిని శ్రీజ. అయితే, తన తల్లి తాను 5 ఏళ్లు ఉన్నప్పుడే అనారోగ్యంతో కన్నుమూసారు. ఈ సమయంలో తన తండ్రి బిడ్డను హక్కున చేర్చి ఏ బాధ లేకుండా చూసుకోవాలి కాని, తనని ఇంట్లో ఒంటరిగా వదిలి, పోషించడం నా వల్ల కాదు అని వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కలవారంతా అమ్మ తరఫు బంధువులను సంప్రదించారు. దీంతో, ఆ బిడ్డ అమ్మమ్మ తాతయ్యలు తనను పెంచి పెద్ద చేశారు. వారి ఆరోగ్యం ఒక్కోసారి సహకరించకపోయిన ఎదోలా కష్టపడి గొప్ప స్థాయికి చేర్చాలని నిర్ణయించుకున్నారు.
సీబీఎస్ఈ పదో తరగతిలో..
చిన్నతనం నుంచి శ్రీజ తన అమ్మమ్మ వాళ్ళతోనే పెరిగింది. అక్కడే కష్టపడి చదువుకుంది. అయితే, తన పదో తరగతిలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా మెరిసింది. పూర్తిగా.. 99.4 శాతం మార్కులతో గెలుపు దక్కించుకుంది. తన అమ్మమ్మ తాతయ్యలు పడ్డ శ్రమకు తగిన ఫలితాన్ని అందజేసింది. దీంతో ఆ ముగ్గురి ఆనందం అంతా ఇంతా కాదు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
అమ్మమ్మ మాటలు..
తన కూతురు చినిపోయిన తరువాత తన అల్లుడు ఏనాడు తన బిడ్డవైపు కన్నెత్తి చూడలేదు. కనీసం ఏదో విధంగానైన కలిసే ప్రయత్నం చేయలేదు. శ్రీజ ఉన్నత మార్కులతో ఉన్నత స్థాయిలో నిలిచింది. ఇప్పుడు తన తండ్రి ఈ విషయం తెలుసుకొని పశ్చాత్తాపపడ్డం ఖాయం. అని శ్రీజ వాళ్ల అమ్మమ్మ తెలిపారు.
శ్రీజ విజయంపై బీజేపీ ఎంపీ హర్షం..
2022లో సీబీఎస్ఈ టెన్త్‌లో 99.4 శాతంతో గెలుపును దక్కించుకున్న శ్రీజను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అభినందించారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్‌లో పోస్ట్ చేసి.. తన గెలుపుకు అభినందనలు, తన అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన మాటలకు తాను కూడా కదిలిపోయడని, తనకు ఎలాంటి సాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నానని వివరించి పోస్ట్ పెట్టారు.
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
ఇక ఇక్కడితో ఆగకుండా తన గెలుపు మొత్తం సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తోంది. జీవితంలో ఎంతో పెద్ద బాధ నుంచి బయటపడి చివరికి తన గెలుపు రాష్ట్రమంతా వినేలా సాధించింది. ఇలా, ఎవ్వరైనా, ఎన్ని కష్టాలొచ్చినా, ఒకరు మనకు తొడు ఉన్న లేకపోయిన అనుకున్న విజయాన్ని చేరుకునే వరకు ఒటమిని అంగీకరించొద్దు.