Retired Bank Manager to NEET Ranker :ఎస్‌బీఐ డిప్యుటీ మేనేజ‌ర్‌గా రిటైర్మెంట్‌.. 64 ఏళ్ల వ‌య‌సులో నీట్ ర్యాంక్ కొట్టి.. MBBS సీటు సాధించా.. ఇదే నా సక్సెస్ స్టోరీ..!

చ‌ద‌వాలంటే వ్య‌క్తికి ఉండాల్సింది ఆశ‌, ఆత్మ విశ్వాసం కాని, వ‌య‌సుతో సంబంధం లేదు. చ‌దువుకోవ‌డం అంటే నేర్చుకోవ‌డం. అది ఎప్పుడైనా ఎలాగైనా చేసేందుకు వీలు ఉంటుంది. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు ఒక 64 ఏళ్ల వ్య‌క్తి.. ఇదే అత‌ని విజ‌య‌గాథ‌..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: చ‌దువుకోవ‌డం అంటే కొంద‌రికి మ‌హా బ‌ద్ద‌కం. ఒక‌రు చెప్తే విని అర్థం చేసుకొని ప‌రీక్ష‌లు రాస్తారు కొందరు. మ‌రి కొందరు స‌మ‌యంతో సంబంధం లేకుండా 24 గంట‌లు చ‌దువుతూనే ఉండాల‌నుకుంటారు. కొంద‌రు వ‌య‌సు పెరుగుతుంది క‌దా.. ఇప్పుడేం చ‌దువులే అనుకుంటూ వ‌దిలేస్తారు. కాని, ఈయ‌న క‌థ అలా కాదు.

DSC Topper : టీఎస్ డీఎస్సీలో టాపర్‌గా నిలిచిన రెంటచింతల యువకుడు.. ఇదే ఇత‌ని స‌క్సెస్ స్టోరీ...

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత‌..

ఒడిశాకు చెందిన జై కిషోర్ ప‌ర్ద‌న్‌.. ఎస్‌బీఐ బ్యాంక్‌లో డిప్యుటీ మేనేజ‌ర్‌గా ప‌ని చేసి రిటైర్ అయ్యారు. తాను పూర్తిగా 30 ఏళ్ల పైనే ఆ ఉద్యోగంలో ఉండి ఉంటారు క‌దా.. అయితే, త‌న క‌ల మాత్రం ఎంబీబీఎస్ చేయాల‌ని ఉండేది. అది క‌ల‌గానే మిగిలిపోతుందేమో అని అనుకునే వారేమో కాని, త‌న రిటైర్మెంట్ అనంత‌రం, ఎంతో ఇష్ట‌ప‌డ్డ ఎంబీబీఎస్ కోర్సులో సీటు సాధించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

దీని కోసం, ముఖ్యంగా ఒక‌రు దాటాల్సిన ఘ‌ట్టం నీట్ ప‌రీక్ష‌. ఇది ఎంబీబీఎస్ కోర్సులో ప్ర‌వేశానికి ప‌రీక్ష‌. ఇందులో ఉన్న‌తంగా రాణిస్తే.. నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019 సెక్షన్ 14లో నిర్దేశించిన వివరాల ప్రకారం నీట్ (యూజీ) తీసుకునే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేనందున త‌న వ‌య‌సులో ఎంబీబీఎస్‌లో సీటు పొంది త‌న చిరకాల కోరికను నెర‌వేర్చుకోవ‌చ్చు.

Four Sisters Doctor Success Story : నలుగురు కూతుళ్లేనా.. అని హేళన‌ చేశారు... కానీ ఇప్పుడు ఈ న‌లుగురు...

నీట్ ప‌రీక్ష‌కు నిబ‌ద్ధ‌త‌గా..

త‌న రిటైర్మెంట్ త‌రువాత‌.. త‌న కుటుంబ బాధ్య‌త‌లు తన భుజాన ఉన్న‌ప్ప‌టికి ఎంతో నిబ‌ద్ధ‌త‌తో నీట్ ప‌రీక్ష‌ను రాసి ఉన్న‌త ర్యాంకు సాధించాల‌నుకున్నారు. దీని కోసం, ఆన్‌లైన్ కోచింగ్ ప్రోగ్రామ్‌లో చేరి, ఎంతో నిబద్ధత కనబర్చారు. సాధార‌ణ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవ్వ‌డ‌మే చాలా క‌ష్ట‌ప‌డ‌తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అంద‌రికీ ఆద‌ర్శంగా.. ఉదాహ‌ర‌ణ‌గా..

ఈ వ‌య‌సులో.. అదీ నీట్ ప‌రీక్ష‌కు సిద్ధ‌మై ఉన్న‌త ర్యాంకు సాధించి డాక్ట‌ర్ అవ్వాల‌నుకున్న ఈయ‌న, 2020లో ప‌రీక్ష రాసి ఉన్న‌త ర్యాంకుతో ఎంబీబీఎస్‌లో అర్హ‌త సాధించి, వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో సీటు దక్కించుకున్నారు. దీంతో ఆయ‌న చిన్న నుంచి పెద్ద వ‌య‌సులో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ ఆద‌ర్శంగా, ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు.

Success Story of Doographics Founder : కేవలం రూ.9వేల‌తో ప్రారంభించా.. నేడు కొన్ని కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నా.. నా స్టోరీ ఇదే..!

#Tags