TS Gurukula Jobs Appointment Date 2024 : శుభ‌వార్త‌.. వివిధ గురుకుల‌ల్లో పోస్టుల భ‌ర్తీ జూలైలోనే.. ఇంకా.

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలోని వివిధ గురుకులాల పరిధిలో ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఫ‌లితాల విడుద‌ల త‌ర్వాత పోస్టింగ్ ప్రక్రియ ఎన్నికల కారణంగా నిలిచిపోయింది.

ఇప్పుడు ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన‌ సర్టిఫికెట్ల పరిశీలనకు వివిధ గురుకులాల సొసైటీలు షెడ్యూల్‌ల‌ను విడుదల చేస్తున్నాయి. వివిధ కేటగిరీలలో దాదాపు 8500 పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఫిబ్రవరి నెలలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు కూడా అందజేశారు. అయితే ఇంకా కొంతమందికి ఎన్నికల నియమావళి కారణంగా నియామక పత్రాలు అందజేయలేదు. వీరికి త్వరలోనే నియామక పత్రాలు అందజేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

☛ Sainik School Job Notification 2024 : సైనిక్ స్కూల్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. అర్హ‌త‌లు ఇవే..

త్వరలోనే..
ఇప్పటికే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో.. విద్యార్థులకు అకాడమిక్ ప్రకారంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత తొందరగా నూతన టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనితో వివిధ గురుకుల సొసైటీలు ధృవపత్రాల పరిశీలనను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కసరత్తు ప్రారంభించాయి. తాజాగా బీసీ గురుకుల సొసైటీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు షెడ్యూల్ విడుదల చేసింది. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకుల విద్యాలయ సంస్థలు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రకటించనున్నాయి.

 TS Mega DSC 2024 Demand : 25000 ఉద్యోగాల‌తో మెగా డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఇవ్వాలి.. లేదంటే..!

జులై నెలలోనే మొత్తం పోస్టుల‌కు..
జులైలోనే పోస్టింగ్‌లు ఇచ్చి నూతన ఉపాధ్యాయులను గురుకుల విద్యాసంస్థల్లో విధులలో చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఫిబ్రవరిలో నియామక పత్రాలు అందుకొని అభ్యర్థులకు త్వరలోనే నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉంది. ధ్రువపత్రాల పరిశీలన ముగిసిన తర్వాత ఆన్‌లైన‌ పద్ధతిలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి ఎలాంటి అవకతవకలు జరగకుండా పోస్టుల‌ ఇవ్వాలని వివిధ గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి.

☛ AP &TS DSC-2024 స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags