TS RTC Jobs 2024 Notification : 2 వారాల్లో ఆర్టీసీలో 3035 ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్‌.. మరో 4 వేల ఉద్యోగాల‌కు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ రానునున్న‌ది. ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేషను రెండు వారాల్లోనే విడుద‌ల చేస్తామ‌ని మంత్రి తెలిపారు. భారీగా ఉద్యోగాల భర్తీ, అలాగే పెద్దసంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తామని తెలిపారు. 

మ‌రో నాలుగు వేల ఉద్యోగాల‌కు...
మొద‌ట‌ 3035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ ఇస్తామ‌న్నారు . తెలంగాణ ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి కూడా ఈ పోస్టుల‌కు ఆమోదించార‌న్నారు. అలాగే మరో నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని పరిశీలిస్తున్నాం.

#Tags