Guest Lecturer Jobs: గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు ఆహ్వానం

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్‌) కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను గెస్ట్‌ లెక్చలర్లతో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేఖ తెలిపారు.
గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు ఆహ్వానం

ఈ మేరకు సెప్టెంబ‌ర్ 13న‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్‌ ఆదేశాల మేరకు డిగ్రీ, పీజీ కోర్సుల బోధనకు మొత్తం 15 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. తెలుగు యూజీ–1, రాజనీతి శాస్త్రం యూజీ–1, హిస్టరీ యూజీ–1, కామర్స్‌ యూజీ–5, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌–1, జువాలజి–1, బోటనీ–1, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌–1, ఒరియా–1, ఎలక్ట్రానిక్స్‌–1, ఫిలాసఫీ–1 పోస్టులు భర్తీ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

చదవండి: Jr. Lecturers Recruitment: పరీక్షకు నిరాకరణ... జేఎల్‌ అభ్యర్థుల ఆందోళన!

పీజీలో 55 శాతం ఉత్తీర్ణత కలిగి పీహెచ్‌డీ/నెట్‌/సెట్‌ అర్హతలు కలిగినవారు అర్హులని తెలిపారు. సెప్టెంబ‌ర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని, 20న ఎంపికలు నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు కళాశాల అకడమిక్‌ కోఆర్డినేటర్‌ జి.రాజశేఖర్‌ (సెల్‌: 9000506595)ను సంప్రదించాలని కోరారు.
చదవండి: September Month Exams: సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..!

#Tags