Telangana Government Jobs 2024 : నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: త్వరలోనే వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని.. అలాగే ఈ ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూలై 19వ తేదీన (శుక్ర‌వారం) తెలిపారు. అలాగే ఓవర్ ల్యాపింగ్ లేకుండా ప‌రీక్ష‌ల‌ను నిర్వహిస్తామ‌ని డిప్యూటీ సీఎం తెలిపారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ప్ర‌త్యేకంగా..
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇందులో ఉద‌యం 10:00 నుంచి సాయంత్రం 5:00 వరకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తాం. ఇప్పటికే నిపుణులను ఎంపిక చేశాం అని భట్టి వివరించారు. అలాగే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. అలాగే డిసెంబ‌ర్‌లో గ్రూప్-2 ప‌రీక్ష‌ నిర్వహణపై పరిశీలించాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ఉద్యోగాలకు 5.51లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విష‌యం తెల్సిందే.

☛ TSPSC Group-3 Postponed : గ్రూప్‌-3 పరీక్ష వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది.. ఇంకా గ్రూప్‌-2 పోస్టుల పెంపుకు కూడా..!

 TSPSC Group-2 Postponed 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. ఎట్ట‌కేల‌కు గ్రూప్‌-2 ప‌రీక్ష‌ వాయిదా.. మ‌ళ్లీ ప‌రీక్ష ఎప్పుడంటే..?

#Tags