Contract and Outsourcing Employees Salary : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త.. వీరి జీతాలు పెంపుపై...
అలాగే పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ప్రతి నెల రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను మంత్రి సూచించారు.
ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా..
ఆన్‌లైన్‌లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్టు సమాచారం. పంజాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి వేతనాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు సేకరించాలని మంత్రి సూచించారు. వారికి నెలనెలా జీతాలు అందేలా నూతన విధానం తీసుకురావాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అలాగే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే అవకాశం కూడా ఉంది.
➤☛ TSRTC 10000 Jobs Details 2024 : ఆర్టీసీలో 10000 ఉద్యోగాలు.. భర్తీ చేస్తాం ఇలా..!