SI Exam Paper Leak Issue : మ‌రో పోటీప‌రీక్ష పేప‌ర్ లీక్‌... ఈ సారి ఏకంగా.. ఎస్ఐ ఉద్యోగ పరీక్ష పేప‌ర్‌ను...

సాక్షి ఎడ్యుకేష‌న్ : మ‌రో పోటీప‌రీక్ష సంబంధించిన పేప‌ర్ లీక్ ఘ‌ట‌న వెలుగులోని వ‌చ్చింది. ఈ మ‌ధ్యాకాలంలో పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌లు దేశ‌వ్యాప్తంగా సంచల‌నం రేపుతున్నాయి. గ‌త తెలంగాణ ప్ర‌భుత్వంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌తో.. పాటు వివిధ ప‌రీక్ష‌ల పేప‌ర్లు లీక్ అయిన విష‌యం తెల్సిందే.

ఇప్పుడు తాజాగా త‌న సొంత పిల్లల కోసం సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌) రాత పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఏకంగా కమిషన్ సభ్యుడే  లీక్ చేశాడు.ఈ సంఘటన రాజస్థాన్‌లో జ‌రిగింది. ఎస్ ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021లో పరీక్ష నిర్వహించింది. ఈ ఎస్ఐ పరీక్షకు రాము రాం రైకా కుమారుడుతో పాటు.. కుమార్తె కూడా హాజరయ్యారు. ఇందులో ఇద్ద‌రు టాపర్లుగా నిలిచారు. 

వెలుగులోకి వ‌చ్చిందిలా..
ఈ కేసు దర్యాప్తులో అరెస్టైన ట్రైనీ ఎస్ఐలకు అధికారులు మళ్లీ అదే పరీక్ష నిర్వహించారు. వారికి వచ్చిన గత, ఇప్పటి మార్కులు చూసి అధికారులకు కూడా కళ్లు తిరిగినంత పనైంది. రైకా కుమార్తె శోభాకు 2021 పరీక్షల్లో హిందీలో 200కు 189, జీకేలో 200కు 155 మార్కులు వచ్చాయి. ఈసారి మాత్రం కేవలం 24, 34 స్కోర్‌ వచ్చాయి ఇంటర్వ్యూలో 50కుగాను 34 మార్కులు వచ్చాయి. ఈమెకు 2021 పరీక్షల్లో ఐదో ర్యాంక్‌ వచ్చింది. ఇక రైకా కుమారుడు దేవేశ్‌కు గతంలో 40 వ ర్యాంక్‌ వచ్చింది. అతడికి ఇంటర్వ్యూలో 28 మార్కులు వచ్చాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే రైకా పిల్లలు ట్రైనీ ఎస్ఐలు శోభా, దేవేశ్ను అధికారులు అరెస్టు చేశారు.

38 మంది ట్రైనీ ఎస్ఐలను అరెస్టు..
2021లో జరిగిన ఎస్‌ఐ, ప్లాటూన్‌ కమాండర్‌ పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి మొత్తం 38 మంది ట్రైనీ ఎస్ఐలను అరెస్టు చేసినట్లైంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు రాజస్థాన్‌ పోలీస్‌ అకాడమీకి వెళ్లి 2021 బ్యాచ్‌ మొత్తానికి గతంలో వారు రాసిన  పేపర్‌తోనే మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఈ బ్యాచ్‌ మొత్తం రాత పరీక్షలో ఘోరంగా విఫలమైందని అధికారులు తెలిపారు. 11 వ ర్యాంక్‌ సాధించిన మంజుదేవి  హిందీలో 51, జీకేలో 71 ప్రశ్నలను మాత్రమే కరెక్ట్‌గా రాసినట్లు పేర్కొన్నారు. ఈమెకు 2021లో హిందీలో 183.75, జీకేలో 168.89 మార్కులు వచ్చాయి. చాలామంది నిందితులు కనీస స్థాయి జీకే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయినట్లు దర్యాప్తు బృందం పేర్కొంది.

#Tags