APSRTC Jobs Notification 2024 : ఎలాంటి రాత ప‌రీక్షలేకుండానే... APSRTCలో ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. అర్హ‌త‌లు ఇవే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు అర్హులైన అభ్యర్థులకు ఆయా ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.

కర్నూలు జోన్‌లో 295 అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. విజయవాడ జోన్‌లో 311 అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 606 అప్రెంటిస్ ఖాళీలను ఎలాంటి పరీక్షలు లేకుండా ఐటిఐ మార్కులు రిజర్వేషన్ల ఆధారంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌కు 5-11-2024 నుంచి 19-11-2024వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

☛➤ APSRTC Jobs Notification 2024 : 7545 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌... ఎప్పుడంటే...?

కర్నూలు జోన్‌లో ఖాళీల వివరాలు ఇవే..
➤☛ కర్నూలు : 47 
➤☛ నంద్యాల : 45 
➤☛ అనంతపురం : 53 
➤☛ శ్రీసత్యసాయి : 37
➤☛ వైఎస్సార్‌ కడప : 65
➤☛ అన్నమయ్య : 48.

పోస్టుల‌ వివరాలు ఇవే..: 
డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్. ఈ ఉద్యోగాల‌కు అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

➤☛ TSRTC 10000 Jobs Details 2024 : ఆర్టీసీలో 10000 ఉద్యోగాలు.. భ‌ర్తీ చేస్తాం ఇలా..!

ఎంపిక విధానం ఇలా.. : 
విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు రూ.118 ఉంటుంది.

ధ్రువపత్రాల పరిశీలన చిరునామా : 
ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్ఆర్టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు. పోన్ నంబర్ 08518-257025.

విజయవాడ జోన్‌లో ఖాళీల వివ‌రాలు ఇవే..:
➤☛ కృష్ణా : 41
➤☛ ఎన్టీఆర్ : 99 
➤☛ గుంటూరు : 45
➤☛ బాపట్ల : 26 
➤☛ పల్నాడు : 45 
➤☛ ఏలూరు : 24
➤☛ పశ్చిమగోదావరి : 31

☛➤ 3,500 ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ త్వ‌ర‌లోనే..? ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడంటే..?

పోస్టులు : 
డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్.

అర్హతలు : 
అభ్యర్థి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: 
విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118

ఆన్‌లైన్‌ దరఖాస్తు : 06-11-2024 నుంచి 20 –11–2024

ధ్రువపత్రాల పరిశీలన చిరునామా : 
ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్ఆర్టీసీ, చెరువు సెంటర్, విద్యాధపురం, విజయవాడ

➤☛ పూర్తి వివ‌రాల‌కు https://www.apsrtc.ap.gov.in/Recruitments.php ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

APSRTC  పోస్టుల పూర్తి వివ‌రాలు ఇవే..:

#Tags