APSRTC Jobs Notification 2024 : 7545 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌... ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌లే తెలంగాణ‌ RTCలో 3035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని.. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పోస్టుల‌కు ఆమోదించార‌ని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించిన విష‌యం తెల్సిందే. అలాగే తెలంగాణ‌లో మరో నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని పరిశీలిస్తున్నామ‌న్నారు.

ఈ నేప‌థ్యంలో ఆంప్ర‌దేశ్ ఆర్టీసీలో కూడా 7,545 పోస్టులకు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇందులో 3,673 రెగ్యులర్ డ్రైవర్, 1,813 కండక్టర్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, 207 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. త్వరలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారికంగా APSRTC క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC)లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

➤☛ TSRTC 10000 Jobs Details 2024 : ఆర్టీసీలో 10000 ఉద్యోగాలు.. భ‌ర్తీ చేస్తాం ఇలా..!

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోస‌మే..
ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఓ వైపు కొత్త బస్సులను రోడ్డెక్కిస్తూనే సిబ్బంది కొరతపైనా దృష్టి పెట్టింది. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించాక డ్రైవర్లు, కండక్టర్ల కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో APSRTCలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలపై నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం అవసరమైన పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అయింది కానీ.. అమ‌లు చేయడంలో ఏ మాత్రం ముందుకు సాగ‌డం లేదు.

➤☛ RRB Exams 2024 Dates Changes : 41,500 రైల్వే జాబ్స్‌.. మారిన కొత్త ప‌రీక్ష తేదీలు ఇవే... హాల్‌టికెట్లు కూడా...

#Tags