TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?
ప్రశ్నల స్థాయి ఆధారంగా విస్తృతంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టుని తార్కికంగా, విశ్లేషణాత్మకంగా, విచక్షణా జ్ఞానంతో అన్వయించడానికి ప్రయత్నించాలి. సాధారణంగా ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. జ్ఞానాత్మకమైనవి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి; విషయ అవగాహనకు సంబంధించినవి, విషయ అనువర్తనకు సంబంధించినవి.
Groups: గ్రూప్–1&2లో ఉద్యోగం సాధించడం ఎలా ?
జ్ఞానాత్మకమైనవి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి :
ఈ తరహా ప్రశ్నలు ప్రధానంగా కంటెంట్‌కు సంబంధించి ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థి పరిజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పరిశీలిస్తారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలంటే విస్తృత పఠనంతో పాటు పునశ్చరణ అవసరం. ఈ ప్రశ్నల సంఖ్య పరీక్ష స్థాయిని బట్టి మారుతుంది.
Success Story: వేలల్లో వచ్చే జీతం కాదనీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..
విషయ అవగాహనకు సంబంధించినవి :
కొన్ని ప్రశ్నలు అభ్యర్థి అవగాహన, తెలివితేటలను పరీక్షిస్తాయి. ఇవి రెండూ నిరంతర సాధన, ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యమవుతాని చెప్పొచ్చు.
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
విషయ అనువర్తనకు సంబంధించినవి :
ఈ తరహా ప్రశ్నల్లో అభ్యర్థి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాలి. లోతైన ఆలోచనతో పాటు సహజ ప్రతిభ, విచక్షణాశక్తులను ఉపయోగించాలి. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి అప్లికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..