Free Training: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

కడప కోటిరెడ్డి సర్కిల్‌: కెనరా బ్యాంకు గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్‌, బ్యూటీ పార్లర్‌ మేనేజ్‌మెంట్‌, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌లలో 30 రోజులు, జ్యూట్‌ బ్యాగుల తయారీకి 13 రోజులు శిక్షణ ఇస్తామని సంస్థ మేనేజర్‌ ఎం.ఆరీఫ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబరు 4న శిక్షణ ఇవ్వనున్నామని, 18–45 ఏళ్ల లోపు కలిగిన నిరుద్యోగ మహిళలు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
చదవండి: AIIMS Contract Jobs : ఎయిమ్స్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags