KGBV Employees: 17మంది కేజీబీవీ ఉద్యోగులకు స్థానచలనం

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న 17మంది ఉద్యోగులకు సెప్టెంబర్ 3న‌ స్థానచలనం కలిగింది.

ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రత్యేక అధికారులతో పాటు సీఆర్టీ, పీజీసీఆర్టీ, పీ ఈటీ, ఏఎన్‌ఎం, అకౌంటెంట్లకు బదిలీ (షిఫ్టింగ్‌) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో జిల్లాలో 54 మంది జిల్లా పరిధిలో దరఖాస్తు చేసుకోగా, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు 12 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ క్రమంలో జిల్లాలో పనిచేస్తున్న 17 మందికి స్థానచలనం జరిగింది. ఇందులో ముగ్గురు ఎస్‌వోలు కొత్త స్థా నాలకు బదిలీ అయ్యారు. తలమడుగులో పనిచేస్తున్న ఎస్‌వో మావల కేజీబీవీకి, ఇంద్రవెల్లిలో పని చేస్తున్న ప్రత్యేక అధికారి తాంసికి, గాదిగూడలో పనిచేస్తున్న ఎస్‌వో ఇంద్రవెల్లికి బదిలీ అయ్యారు.

చదవండి: Swecha: మన భాషలో స్వేచ్ఛగా.. తెలుగు ఏఐ చాట్‌బోట్‌ రూపకల్పనకు ప్రణాళికలు

వీరితో పాటు తోషంలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం మా వల కేజీబీవీకి, తలమడుగులో పనిచేస్తున్న అకౌంటెంట్‌ మావల కేజీబీవీకి బదిలీ అయ్యారు. అలాగే తోషంలో పనిచేస్తున్న పీఈటీ తాంసికి, తాంసిలో పనిచేస్తున్న పీఈటీ మావలకు బదిలీ అయ్యారు.

తలమడుగులో పనిచేస్తున్న బోటనీ పీజీసీఆర్టీ ఆదిలాబాద్‌అర్బన్‌కు స్థానచలనం కలిగింది. అయితే ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించి ఇంకా వివరాలు తెలియరాలేదు. ఈ బదిలీలకు సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.

#Tags