TS SGT Exam 2024 Syllabus & Exam pattern : 6,508 ఎస్జీటీలు పోస్టులు.. సిలబస్ ఇదే.. ఈ సారి పరీక్షా విధానం కూడా..
ఈ పోస్టుల్లో ఎక్కువగా 6,508 ఎస్‌జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే 2629 స్కూల్ అసిస్టెంట్, 727 లాంగ్వేజ్ పండింట్,182 పీఈటీ పోస్టులు, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. పాత సిలబస్, పాత పద్దతిలోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
6,508 ఎస్‌జీటీ పోస్టుల పూర్తి వివరాలు వివరాలు ఇవే..
ఎస్‌జీటీ పోస్టులకు 80 మార్కులకు రాత పరీక్ష :
ఎస్‌జీటీ పోస్టులకు రాత పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు. ఎస్‌జీటీ పోస్ట్‌లకు 8 విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే వీలుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాల నుంచి 20 ప్రశ్నలు చొప్పున, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కో సబ్జెక్ట్‌లో 18 ప్రశ్నలు చొప్పున అడగనున్నారు. అదే విధంగా టీచింగ్ మెథడాలజీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఇలా మొత్తం 8 విభాగాల్లో 160 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది.
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) అర్హతలు ఇవే..:
ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాసవ్వాలి. (లేదా) నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత (లేదా) ఎన్‌సీటీఈ నిబంధనలు-2002 ప్రకారం-45 శాతం మార్కులతో ఇంటర్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాసవ్వాలి. దీంతోపాటు టీఎస్ టెట్ లేదా ఏపీ టెట్ పేపర్-1లో లేదా సీటెట్‌లో అర్హత సాధించాలి.
ఎస్‌జీటీ అభ్యర్థులు వీటిపై ఫోకస్ పెట్టితే ఉద్యోగం మీదే.. :
☛ ఎస్‌జీటీ పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. అవి.. విద్యా దృక్పథాలు, కంటెంట్, మెథడాలజీ.
☛ విద్యా దృక్పథాలకు సంబంధించి వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు; దేశంలో విద్యా చరిత్ర; ఉపాధ్యాయ సాధికారత, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, విద్యాహక్కు చట్టం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
☛ సోషల్‌లో భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం కంటెంట్ కోసం పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదవాలి.
☛ మ్యాథ్స్‌లో సంఖ్యామానం, అంకగణితం, బీజగణితం, సమితులు-సంబంధాలు, క్షేత్రగణితం, రేఖాగణితం;
☛ తెలుగులో కవులు-కావ్యాలు, భాషా రూపాలు, పరుషాలు-సరళాలు;
☛ ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వొకాబ్యులరీ, ఆర్టికల్స్-ప్రిపొజిషన్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి.
☛ మెథడాలజీని ప్రత్యేక దృష్టితో చదవాలి.
☛ బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనా ప్రణాళిక, మూల్యాంకనం తదితర అంశాలను కంటెంట్‌లోని టాపిక్స్‌తో అన్వయించుకుంటూ చదవాలి.
ముఖ్యమైన సమాచారం ఇదే..
మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
తెలంగాణ సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) సిలబస్, పరీక్షావిధానం ఇదే..