July 22, 23rd Schools Holidays Due to Heavy Rain 2024 : అలర్ట్‌.. భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి స్కూల్స్‌కు సెల‌వులు.. ఇంకా..!

సాక్షి ఎడ్య‌కేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో భారీగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ భారీ వర్షాల‌తో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.

అలాగే ప్ర‌జ‌లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. రాగల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

➤ Telangana Schools New Timings 2024 : తెలంగాణ‌లో స్కూల్స్ టైమింగ్స్‌లో చేసిన‌ మార్పులు ఇవే..! ఇక‌పై ఉద‌యం 9.00 నుంచి..

ఆయా జిల్లాలకు హెచ్చరికల నేప‌థ్యంలో..

మరోవైపు.. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్‌, కొమురంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.

కలెక్టర్ ఆదేశాలు..
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ సి.నాగరాణి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. వరదల దృష్ట్యా శనివారం కూడా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

2 రోజులు పాటు సెల‌వులు.. ఇంకా..

అలాతే అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థ‌ల‌కు సోమ‌వారం సెల‌వులు ప్ర‌క‌టించారు. అలాగే అల్లూరి జిల్లా రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్‌లోని 4 మండ‌లాల్లోని స్కూల్స్‌కు 2 రోజులు పాటు సెల‌వులు ఇచ్చారు. అలాగే ఈ భారీ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగితే.. ఈ సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది.

ఇక తెలంగాణ‌లో కూడా మూడు రోజులు పాటు..
ఇక తెలంగాణ‌లో కూడా మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురునున్న విష‌యం తెల్సిందే. సోమ‌, మంగ‌ళ‌వారం తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ సెల‌వుల‌పై తెలంగాణ విద్యాశాఖ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. వర్షం తీవ్ర‌త‌ను బ‌ట్టి స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

➤ Job with 34.40 Lakhs Package : త‌ల్లిదండ్రుల క‌ష్టాని ఫలితంగా యువ‌తి గెలుపు.. ఏకంగా 34.40 ల‌క్ష‌ల ప్యాకేజీతో ఉద్యోగం..!

ఈ రాష్ట్రాల్లో కూడా సోమ‌, మంగ‌ళ‌వారం సెల‌వులు..

రానున్న రోజుల్లో ఒక వేళ సోమ, మంగ‌ళ‌వారాల్లో కూడా ఇలాగే వ‌ర్షాలు కొన‌సాగితే మాత్రం మ‌ళ్ళీ సెలవులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంటుందని వాతావ‌ర‌ణ కేంద్రాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, నాగ్‌పూర్, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. అయితే, దేశంలో చాలా రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండ‌డంతో జ‌నాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌డ‌మే క‌ష్ట‌మైంది. ప‌లు చోట్ల‌లో మాత్రం విరామం లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా బ‌డులు, కాలేజీలు మూసివేయాల‌ని ప్ర‌భుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో కన్వర్ యాత్ర కారణంగా ఒక‌టి నుంచి ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు శనివారం నుంచి సోమవారం వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్ర‌భుత్వం. అయితే, అక్క‌డి డిప్యూటీ సీఎం జారీ చేసిన‌ ఆదేశాల మేరకు జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి వీరేంద్రకుమార్ సింగ్ ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని పాఠశాలలను ప్ర‌క‌టించిన తరగతుల‌ వరకు మూసి ఉంచాలని తెలిపారు.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 27-07-2024 : (శనివారం) బోనాలు
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛ 07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags