Three Days Schools and Colleges Holidays 2024 : జూలై 27,28,29 తేదీల్లో వ‌రుస‌గా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్ విద్యార్థులు ఈ మ‌ధ్య‌కాలంలో ఇటు వ‌ర్షాలు.. అటు పండ‌గ‌ల రూపంలో వ‌రుస‌గా సెల‌వుల‌తో పండ‌గ చేసుకుంటున్నారు. ఇటీవ‌లే భారీ వ‌ర్షాల‌తో స్కూల్స్ సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

అయితే పండ‌గ రూపం స్కూల్స్ విద్యార్థుల‌కు వ‌రుస‌గా మూడు రోజులు పాటు సెల‌వులు రాన్నాయి. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. జూలై 27, 28,29 తేదీల్లో మూడు రోజులు సెలవులు రానున్నాయి. వరుసగా హాలీడేస్‌ రావడంపై విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. 

29న ఈ సెలవు..

ఈ మూడు రోజులు జోరు వానలు ఉండటంతో.. స్కూళ్లకు వెళ్లే సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో సెలవులు రావడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జూలై 27వ తేదీ నాలుగో శనివారం చాలా పాఠ‌శాల‌కు సెల‌వు ఉన్న విష‌యం తెల్సిందే. అలాగే 28 సాధారణంగా ఆదివారం. కనుక ఆ రోజు నార్మల్‌గానే హాలీడేనే. ఇక సోమ‌వారం మరో రోజు సెలవు ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు పండగ సందర్భంగా 29న ఈ సెలవు రానుంది. మొత్తానికి విద్యార్థులకు మాత్రం వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.

రాష్ట్ర పండుగగా..

హైద‌రాబాద్‌లో బోనాల సంబురాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు మరికొన్ని ప్రముఖ దేవాలయాలు. బోనాల పండుగ వేళ తెలంగాణ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ బోనాల జాతర దాదాపు శతాబ్ద కాలం నుంచి జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అంతేకాదు ప్రతి ఏటా ఈ బోనాలు జాతర కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడంతో ఈ పండుగ మరింత ప్రసిద్ధి చెందింది. బోనాల సంబురాల్లో కొన్ని ప్రముఖ ఆలయాల్లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబురాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూలై 5న అమావాస్య శుక్రవారం రాగా.. జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఆ మరుసటి రోజు అంటే జూలై 7 ఆదివారం నుంచి భాగ్యనగరంలో బోనాల సంబరాలు ప్రారంభమయ్యాయి. చివర్లో అంటే ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags