School Closed news: మూతపడ్డ పాఠశాల ఎందుకంటే..
కౌటాల(సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగడ గఢ్ లోని గిరిజన ఏకోపాధ్యాయ ప్రాథ మిక పాఠశాలలో 25 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయిని సుశీల ఇటీవల బదిలీపై వెళ్లగా.. మరో టీచర్ను కేటాయించలేదు. దీంతో వారం రోజులుగా బడి తలుపులు తెరుచుకోవడం లేదు. విద్యార్థులంతా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకే తాళం వేసిన బడి మెట్లపై కూర్చున్న విద్యార్థులుపాఠశాలకు చేరుకున్నారు.
Tomorrow job mela: నిరుద్యోగ యువతకు రేపు జాబ్ మేళా: Click Here
త్వరలో టీచర్లను సర్దుబాటు
తాళం వేసి ఉండటంతో అక్కడే కాసేపు ఆడుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. దీనిపై స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్పర్సన్ మడావిపోచానిని వివరణ కోరగా.. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో టీచర్లను సర్దుబాటు చేస్తారని తెలిపారు.
#Tags