School Holidays Extended Update News 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మరో నాలుగు రోజులు పాటు సెలవులు.. ఇంకా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణం రోజురోజుకి మారుతోంది ఉంటుంది. ఒక రోజు తీవ్ర‌మైన ఎండ‌లు.. మ‌రో రోజులు భారీ వ‌ర్షాలు కురుసున్నాయి. గత వారం రోజుల నుంచి ఈ తీవ్రత విపరీతంగా ఉంది. వారం క్రితం అక్కడక్కడ వర్షాలు పడినా.. ప్రస్తుతం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనాలు.

అలాగే తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌ద‌శ్‌లో ఎండల తీవ్రత పెరుగుతుంది. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. గత వారం రోజుల నుంచి ఈ తీవ్రత విపరీతంగా ఉంది. వారం క్రితం అక్కడక్కడ వర్షాలు పడినా.. ప్రస్తుతం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనాలు. పిల్లలు, మహిళలు, వయస్సుపై బడిన వాళ్లు బయటకు రావాలంటనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. 

☛ School Holidays Extended 2024 : గుడ్‌న్యూస్‌.. స్కూల్స్ సెల‌వులు పెంపు.. కానీ..!

 నైరుతి రుతుపవనాలు రాకతో తెలంగాణలో వర్షాలు ఎప్పుడు కురుస్తాయో అని ఎదురు చూస్తున్నారు. ఎండ తీవ్రత తగ్గినా.. పొడి వాతావరణం, వేడి గాలుల కారణంగా ఉక్కపోత ఎక్కువగా ఉంది. ఎండల నేపథ్యంలో మార్చి 15 నుంచే రాష్ట్రంలో స్కూళ్లకు ఒంటి పూట బడులు మొదలయ్యాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు తెలంగాణలో ఒంటి పూట బడులు ఉండగా.. ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించారు.
జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వర్షాలు కురిసినా వేసవి సెలవులను మాత్రం పెంచే అవకాశం చాలా తక్కువగా ఉంది.  కానీ జూన్ నెలలోనే విద్యార్థులకు మరి కొన్ని రోజులు సెలవులు రానున్నాయి. 

☛ Telangana School Holidays List 2024-25 : 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ విడుద‌ల‌.. ఈ ఏడాది సెల‌వులే సెల‌వులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

మూడు రోజులు సెలవులు.. 
జూన్ 16, 23, 30వ తేదీలు ఆదివారాలు కనుక మూడు రోజులు సెలవులు ఉంటాయి. వీటితో పాటు.. ఇదే నెలలో బక్రీద్ పండుగ కూడా ఉంది. ఈ రోజు ప్రభుత్వ సెలవు కాగా.. జూన్ 16న ఈ పండుగను జరుపుకోనున్నారు.  
అయితే జూన్ 17వ తేదీ కూడా కొన్ని కాలేజీల్లో సెలవు మంజూరు చేశారు. ఇస్లామిక్ లూనార్ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగను ధు అల్-హిజ్జా 10వ రోజున జరుపుకుంటారు. బక్రీద్ 2024 జూన్ 16, 2024న వస్తుంది. మరుసటి రోజు వరకు కొనసాగుతుంది. అంటే జూన్ 17 వరకు ఉంటుంది. దీంతో విద్యార్థులకు వరుసగా మరోసారి రెండు రోజులు సెలవులు వస్తాయి. మొత్తంగా మరో 4 రోజులు జూన్ నెలలో సెలవులు రానున్నాయి.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags