Sankranti Holidays 2025 Extended : గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు..! కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల‌ ప్రజలు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ పండ‌గ‌కు దేశ నలుమూలల నుంచి సొంతూళ్లకు వెళ్లీ సంతోషంగా ఈ పండ‌గ‌ను జ‌రుపుకుంటారు. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌, కాలేజీల‌కు సంక్రాంతి పండ‌గ‌కు సెల‌వులు కూడా ప్ర‌క‌టించారు.

ఈ మూడు రోజులే..
జ‌న‌వ‌రిలో వ‌చ్చే పండుగ సంక్రాంతికి మూడు రోజులు సెలవులు ఉంటాయి. జ‌న‌వ‌రి 13వ తేదీ భోగి, జ‌న‌వ‌రి 14వ తేదీన సంక్రాంతి, జ‌న‌వ‌రి 15వ తేదీన క‌నుమ ఉంటుంది. కానీ, 15వ తేదీకి మాత్రం ఉన్న సెల‌వు ఆప్ష‌నల్‌గా ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. 

మ‌రో మూడు రోజులు సెల‌వులు పొడిగింపు...?
అయితే తమిళులు కూడా ఈ పండుగను అత్యంత వైభ‌వంగా, ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా పలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు అదనపు బస్సులు, రైళ్లు తదితరాలు సిద్ధంగా ఉన్నాయి. దీపావళి కంటే ఎక్కువ మంది పొంగల్ జరుపుకోవడానికి తమ స్వగ్రామాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. 

జనవరి 14 నుంచి 19 వరకు..
ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది. జనవరి 14న తై పొంగల్ పండుగను జరుపుకోనున్నట్లు ప్రకటించింది. అలాగే జనవరి 15, జనవరి 16న మట్టుపొంగల్, రైతు దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. దీంతో ఈ మూడు రోజులు సెలవు దినాలుగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే శుక్రవారం మాత్రమే పని దినం కావడంతో చాలామంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వచ్చే 2 రోజులు (శని, ఆదివారాలు) సెలవులు కావడంతో మధ్యలో వచ్చే శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 

పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్కూల్స్‌, కాలేజీల‌కు జనవరి 17వ తేదీ కూడా కూడా సెలవు దినంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.దీంతో జనవరి 14 నుంచి 19 వరకు మొత్తం ఆరు రోజులు సెలవులు వచ్చాయి. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సెల‌వుల‌ను...?
అయితే జనవరి 17న ఇచ్చిన సెలవును కవర్ చేయడానికి జనవరి 25 (శనివారం) పనిదినంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో చాలా మంది ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మేరకు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండ‌క్కి ఇచ్చిన సెల‌వులు పొడిగించాల‌ని ప్ర‌భుత్వాన్ని ప‌లువులు విజ్జ‌ప్తి చేస్తున్నారు. అయితే ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. వేచి చూడాలి.

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే :
జ‌న‌వ‌రి 2025 :
➤☛ భోగి – 13
➤☛ సంక్రాంతి – 14
➤☛ రిపబ్లిక్ డే – 26

ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25

#Tags