RMS School Admission 2025-26 : ఆర్మీ స్కూల్స్‌లో వివిధ‌ తరగతుల్లో ప్రవేశాలు.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి 6,9 తరగతిలో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.

ఈ స్కూల్స్ ప్ర‌వేశం పొందాలంటే... ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 రాయాల్సి ఉంటుంది. అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ తదితర వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.

ఇతర వర్గాల పిల్లలు కూడా..
రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు బాలబాలికలకు విద్యా బోధన ఉంటుంది. వీటిలో రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరుల పిల్లలు చదువుకోవచ్చు. ఈ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇవి ఆంగ్ల మాధ్యమంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూళ్లు.

వ‌య‌స్సు :

ఆర్మీ స్కూల్స్‌లో 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 2025 మార్చి 31 నాటికి విద్యార్థి వయస్సు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2013 నుంచి మార్చి 31, 2015 మధ్య జన్మించి ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశానికి 2025, మార్చి 31 నాటికి అభ్యర్థి వయస్సు 13 ఏళ్ల కంటే తక్కువ, 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఏప్రిల్‌ 1, 2010 నుంచి మార్చి 31, 2012 మధ్య జన్మించి ఉండాలి.

అర్హ‌త‌లు ఇవే..
6వ తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. 9వ తరగతిలో ప్రవేశానికి, విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు.

రిజర్వేషన్ వీరికే.. : 
రక్షణ విభాగాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరుల పిల్లలకు మాత్రమే కేటాయించారు.

ఎంపిక ప్రక్రియ : 

రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు.

ప్రవేశ పరీక్ష విధానం ఇలా.. : 
మల్టిపుల్ ఛాయిస్ ఓఎమ్మార్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. 6వ తరగతికి ఇంటెలిజెన్స్ (50 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ (50 మార్కులు), మ్యాథ్స్‌ (50 మార్కులు), ఇంగ్లిష్ (50 మార్కులు). 5వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు.

9వ తరగతికి ప‌రీక్షా విధానం ఇలా.. : 
ఇంగ్లిష్ (50 మార్కులు), హిందీ (20 మార్కులు), సోషల్ సైన్స్ (30 మార్కులు), మ్యాథ్స్‌ (50 మార్కులు), సైన్స్ (50 మార్కులు). 8వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 50 మార్కులు.
ఆన్‌లైన్ దరఖాస్తు, దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: 19-09-2024.

మిలిటరీ స్కూళ్ల వివ‌రాలు ఇవే..

1. చైల్ (హిమాచల్ ప్రదేశ్), 
2. అజ్‌మేర్‌ (రాజస్థాన్), 
3. ధోల్‌పుర్‌ (రాజస్థాన్), 
4. బెల్గాం (కర్ణాటక), 
5. బెంగళూరు (కర్ణాటక). 

#Tags