Means-cum-Merit Scholarship : స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, భీమవరం: నేషనల్‌ మీన్స్‌–కం–మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌)పరీక్షకు సెప్టెంబర్‌ 15వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
National Merit Scholarship 2023

8వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు డిసెంబర్‌ 3న రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షకు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3.50 లక్షలులోపు ఉన్న విద్యార్ధులు అర్హులన్నారు. జనరల్‌, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.

Also read: NMMS Scholarship 2023: పేద విద్యార్థులకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక ప్రోత్సాహం

#Tags