Andhra Pradesh: కేజీబీవీ పాఠశాలలో క‌లెక్ట‌ర్ ర‌వి పట్టాన్‌శెట్టి త‌నిఖీలు....

వివిధ పాఠ‌శాల‌ల్లో ప‌లు మార్లు స‌రైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌డం ఈ త‌నిఖీల‌కు కార‌ణం. విద్యార్థుల‌కు త‌గిన భోజ‌నం, స‌దుపాయాలు, త‌ర‌గ‌తుల నిర్వాహం, టీచ‌ర్ల ప‌నితీరు గురించి ఆయ‌న మాట‌ల్లో...
changes in anakapalli schools and hostels

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యా వ్యవస్థలో ప్రభుత్వం వినూత్న మార్పులు తీసుకు వచ్చిందని కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి అన్నారు. మండలంలో సురవరం వద్ద ఉన్న కేజీబీవీ పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు తయారు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, తరగతుల నిర్వహణ, వసతుల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతులు

అన్నీ బాగున్నాయని విద్యార్థులు బదులివ్వడంతో కలెక్టర్‌ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చైల్డ్‌ ఇన్‌ఫో రేషియో ఎలా ఉందని సిబ్బందిని, వలంటీర్లను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యాలయాల్లో ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థినులకు కార్పొరేట్‌ స్థాయిలో బోధన సాగించి ధీటుగా తయారు చేయాలన్నారు.

విషాదం: ఓయూ మాజీ వీసీ నవనీత రావు కన్నుమూత

#Tags