Employees and students 5days Holidays news: ఉద్యోగులకు విద్యార్థులకు సెప్టెంబర్‌ నెలలో వరుసగా 5రోజులు సెలవులు

Holidays news

సాధారణంగా ప్రతినెల ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు వస్తుంటాయి. నెల వచ్చిదంటే చాలు ఏయే రోజుల్లో పాఠశాలలు సెలవులు ఉన్నాయో విద్యార్థులు అతృతగా ఎదురు చూస్తుంటారు. అలాగే ఉద్యోగులు కూడా ఏయే రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నాయోనన్న విషయాన్ని ముందస్తుగానే తెలుసుకుంటారు. ఎందుకంటే సెలవు రోజుల్లో ఎక్కడైనా టూర్‌..

మూతపడిన తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాలు: Click Here
 

సాధారణంగా ప్రతినెల ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు వస్తుంటాయి. నెల వచ్చిదంటే చాలు ఏయే రోజుల్లో పాఠశాలలు సెలవులు ఉన్నాయో విద్యార్థులు అతృతగా ఎదురు చూస్తుంటారు. అలాగే ఉద్యోగులు కూడా ఏయే రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నాయోనన్న విషయాన్ని ముందస్తుగానే తెలుసుకుంటారు. ఎందుకంటే సెలవు రోజుల్లో ఎక్కడైనా టూర్‌ ప్లాన్‌ చేసేందుకు సిద్ధమవుతుంటారు. అలాగే విద్యార్థులకు సెలవులను బట్టి కూడా కుటుంబం ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో అంటే సెప్టెంబర్‌లో 7, 16వ తేదీల్లో పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

ఇక వచ్చే నెలలో ముఖ్యమైన పండగ గణేష్ చతుర్థి. ఈ వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వస్తుంది. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు. అలాగే మరుసటి రోజు ఆదివారం. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఆదివారం రావడంతో మరో రోజు కలిసి వస్తుంది. ఈ గణేష్ చతుర్థి పండుగ చాలా రాష్ట్రల్లో ఘనంగా జరుపుకొంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

సెప్టెంబర్ 16న ఈద్-ఎ-మిలాద్

ఇక సెప్టెంబర్‌లో మరో రోజు కూడా పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించింది ప్రభుత్వం. మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. ఈ పండుగను ముహమ్మద్ పుట్టినరోజు, నబీ డే లేదా మౌలిద్ అని కూడా అంటారు. ఈ రోజు అన్ని ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు మూసి ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సెప్టెంబర్‌ 16 సోమవారం వస్తుంది. అంటే 14న రెండో శనివారం, 15న ఆదివారం, 16న ఈద్-ఎ-మిలాద్. ఇలా చూస్తే ఏకంగా మూడు రోజుల పాటు సెలవు రానుంది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌ నెలలో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. వివిధ పండగల, ఇతర కార్యక్రమాల వల్ల బ్యాంకులకు సెలవులు.

#Tags