School Holidays Cancelled: విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్‌ సెలవులు రద్దు..

Bad news for Students

అక్టోబర్ నెలలో విద్యార్థులకు దాదాపు 15 రోజులకుపైగా సెలవులు రావడంతో చాలా మంది దీన్ని వెకేషన్‌గా తీసుకొని దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేశారు.

నవంబర్ 3 వరకు సెలవులు

దసరా సెలవులు కూడా ఈ కాలంలో ఉండటంతో, బతుకమ్మ పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఇక నవంబర్ నేటి నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని పాఠశాలలు దీపావళి సందర్భంగా విద్యార్థులకు నవంబర్ 3 వరకు సెలవులు ప్రకటించాయి, దీనితో విద్యార్థులు నవంబర్ 4న తిరిగి స్కూల్స్‌కి వెళ్లనున్నారు.

మున్సిపల్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు: Click Here

అలాగే నవంబర్ 9న రెండవ శనివారం రాబోతోంది. ఈ రోజు సెలవు రద్దు చేసినట్టు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే.

సెలవును రద్దు

ఇదే రోజున మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా రావడంతో, ప్రభుత్వం రెండింటిని కలిపి సెలవుగా ప్రకటించింది. ఈ క్రమంలో ప్రభుత్వం నవంబర్ 9న రెండవ శనివారం సెలవును రద్దు చేసి, వర్కింగ్ డేగా ప్రకటించింది.

నవంబర్ 15న గురునానక్ జయంతి

ఇటీవల వరదలు, వర్షాల కారణంగా అనేక సెలవులు ప్రకటించడంతో, ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఆ రోజు విద్యాసంస్థలు సాధారణంగానే నడుస్తాయి. నవంబర్ 15న గురునానక్ జయంతి సందర్భంగా సెలవులు ఉంటాయి.

అమరవీరుల దినోత్సవం సందర్బంగా సెలవు

అంతేకాక, నవంబర్ నెలలో మరికొన్ని ప్రత్యేక పండుగలు ఉండటం వల్ల కొన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయి. ఉదాహరణకు నవంబర్ 6న ఛట్ పూజ, నవంబర్ 14న గురుతేజ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా సెలవు ఉంటుంది.

#Tags