INSPIRE Manak Competitions : ఇన్‌స్పైర్ పోటీల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి.. ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు..!

విద్యార్థుల్లో శాస్త్రీయ సాంకేతికతను పెంచి భావి శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు లభించే అరుదైన అవకాశంపై జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు స్కూల్స్‌ సైన్సు టీచర్లు ఆసక్తి చూపడం లేదు.

కడప: విద్యార్థుల్లో శాస్త్రీయ సాంకేతికతను పెంచి భావి శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు లభించే అరుదైన అవకాశంపై జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు స్కూల్స్‌ సైన్సు టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఇన్‌స్పైర్‌ మనాక్‌ కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శాస్త్రీయ ప్రయోగ పోటీలకు జిల్లా నుంచి ఆశించిన మేర స్పందన కరువయింది. జిల్లావ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1015 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు కలుపుకుని ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టుల చొప్పున 5000 ప్రాజెక్టులను యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది.

Education World India Rankings: మహిళా డిగ్రీ కళాశాల.. ‘సీమ’కే మకుటం

ఇప్పటివరకు జిల్లాలో కేవలం 14 పాఠశాలలకు సంబంధించి 70 ప్రాజెక్టులను మాత్రమే నమోదు చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఇందులో భాగస్వాములు కావాల్సి ఉంది. ఆ దిశగా వారు అంతగా చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్‌స్పైర్‌ మనాక్‌ నామినేషన్ల నమోదు చేసుకునేందుకు సంబంధించిన గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉంది. ఇన్‌స్పైర్‌ మనాక్‌పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నాం

ఇన్‌స్పైర్‌ మనాక్‌ కాంపిటీషన్‌పై జిల్లాలోని సైన్సు ఉపాధ్యాయులకు కాంప్లెక్స్‌ మీటింగ్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. దీంతోపాటు యాప్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పాను. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించి ప్రాజెక్టుల నమోదుకు సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికై నా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తొందరపడాలి. 
– ఎబినైజర్‌, జిల్లా సైన్సు అధికారి

Telangana MBBS Seats Increased : తెలంగాణ‌లో మొత్తం 8,915కు పెరిగిన‌ ఎంబీబీఎస్ సీట్లు.. పూర్తి వివ‌రాలు ఇవే...

నిర్లక్ష్యం చేయడం తగదు..

ఇన్‌స్పైర్‌ మనాక్‌ నామినేషన్లకు సంబంధించి అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్పందించాలి. సైన్సు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని నామినేషన్లను త్వరితిగతిన పూర్తి చేయాలి. ప్రతి పాఠశాల నుంచి తప్పని సరిగా ఐదు నామినేషన్లు వచ్చేలా చూడాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి లక్ష్యాన్ని పూర్తి చేయాలి.

– మర్రెడ్డి అనూరాధ, జిల్లా విద్యాశాఖ అధికారి

AP Medical Colleges : ఏపీ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేసేందుకు ప్ర‌భుత్వం మొగ్గు..

#Tags