Education Scheme : ఈ ప‌థ‌కం ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో చ‌దివే విద్యార్థుల‌కు మాత్ర‌మేనా!

స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఇందులో భాగంగా ఏపీటీఎఫ్ అధ్య‌క్షులు మాట్లాడుతూ..

అనంతపురం: ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు రాయల్‌ వెంకటేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నరసింహులు మాట్లాడుతూ... జీఓ 117 రద్దు చేసి 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియ ఉపసంహరించుకోవాలన్నారు.

IOCL Recruitment : ఇండియన్‌ ఆయిల్‌ కార్పేరోషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే

విలీనం ప్రక్రియతో మారుమూల గ్రామాల్లోని పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీ మేరకు వెంటనే జీఓ 117 రద్దు చేయాలన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలను పూర్వ ఐచ్ఛిక పద్దతిలో ప్రవేశ పెట్టాలని కోరారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేష్‌, సిరాజుద్దీన్‌ మాట్లాడుతూ... ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ పీఎఫ్‌ సైట్‌ అప్‌డేట్‌ చేసినా అనంతపురం జిల్లాలో మాత్రం కాలేదన్నారు.

In charge VCs AP: యూనివర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వీసీల నియమ‌కం.. 17 వర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వీసీలు వీరే..

దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు పార్ట్‌ ఫైనల్‌, లోన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే సైట్‌ను అప్‌డేట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఫెడరేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్‌ కుమార్‌, రాష్ట్ర కౌన్సిలర్లు రమణ, సర్దార్‌ వలి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ కోటగిరి వన్నప్ప, జిల్లా నాయకులు పాతిరెడ్డి, ప్రసాద్‌, హనుమంతు, ఈశ్వరయ్య, ఎల్లప్ప పాల్గొన్నారు.

Singareni Jobs: ఎక్స్‌టర్నల్‌ అభ్యర్థులకు హాల్‌టికెట్లు

#Tags