SBIF Scholarship Program : పేద విద్యార్థుల ఉన్న‌త విద్య‌కు ఎస్‌బీఐఎఫ్‌ ఆర్థిక సాయం.. స్కాల‌ర్‌షిప్‌కు అర్హులు వీరే..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఎస్‌బీఐఎఫ్‌)..ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనందించి, వారి విద్యను ప్రోత్సహించేందుకు ఆరో త­రగతి నుంచి పీజీ వరకు విద్యార్థులను ఎంపికచేసి వారి చదువులకు ఆర్థిక సాయం అందజేస్తోంది. 

»    అర్హత: ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివి ఉండాలి. డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎంలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
»    గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ.3లక్షలు మించకూడదు.
స్కాలర్‌షిప్‌ వివరాలు
»    ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.15,000.
»    అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు రూ.50,000
»    పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు రూ.70,000.
»    ఐఐటీ విద్యార్థులకు రూ.2,00,000.
»    ఐఐఎం(ఎంబీఏ/పీజీడీఎం) విద్యార్థులకు రూ.7.50 లక్షలు.
»    ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికచేస్తారు. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని జమ చేస్తారు. ఇది వన్‌టైమ్‌ స్కాలర్‌షిప్‌ మాత్రమే.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్‌/మొబైల్‌ నంబర్‌ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.10.2024.
»    వెబ్‌సైట్‌: www.sbifashascholarship.org

Apprenticeship Trainee Posts : డీఈబీఈఎల్‌లో గ్రాడ్యువేట్ అప్రెంటీస్ షిప్ ట్రైనీ పోస్టులు.. స్టైపెండ్‌ నెల‌కు..

#Tags